వావ్.. బుక్ చేసిన అరగంటలోనే సిలిండర్ డెలివరీ..!

సడెన్ గా గ్యాస్ అయిపోతే.. రెండు మూడు రోజులు తిప్పలు తప్పని పరిస్థితి ఉంది.
గ్యాస్ బుకింగ్(gas booking) విషయంలో ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సడెన్ గా గ్యాస్ అయిపోతే.. రెండు మూడు రోజులు తిప్పలు తప్పని పరిస్థితి ఉంది.
అయితే.. ఈ కష్టాలన్నింటిని దూరం చేస్తూ ఓ కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(iocl). గ్యాస్ బుక్ చేసిన అరగంటలోనే డెలివరీ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.
తత్కాల్ LPG సర్వీస్ పేరిట ఈ సేవలను ప్రారంభించబోతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది. తత్కాల్ లో సిలిండర్ బుక్ చేసుకుంటే 30-45 నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు IOCL అధికారులు.
ఫిబ్రవరి 1 నుంచి ఎంపిక చేసిన నగరాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశ ప్రజలకు 'సులభతర జీవనం' అందించాలన్న కేంద్రం సూచనల మేరకు దీనిని ప్రారంభిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
తత్కాల్ LPG సేవలకు ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయనున్నారు. అయితే.. ఎంత వసూలు చేయాలనేదానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీకి వచ్చి.. ఫిబ్రవరి 1 నుంచి ఈ స్కీంను లాంఛ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- A day with naxalite: నక్సలైట్ తో ఒక రోజు (ఎపిసోడ్-1)
- 2 నెలలకే 4 నెలల గర్భవతి.. విడాకులు ఇచ్చిన భర్త.. కావాలన్న ప్రియుడు!