Top
Batukamma

LPG price:మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంత బాదారంటే..?

LPG price:మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంత బాదారంటే..?
X
Highlights

ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక.. వెంట వెంటనే గ్యాస్ ధరలు పెరగడంపై ప్రజలు ఆందోళన పడుతున్నారు.

LPG price hiked: ఎల్పీజీ ధరలు(lpg price) ప్రజలకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. సబ్సిడీ ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇంధన సంస్థలు(oil companies).. అడ్డగోలుగా రేట్లు పెంచుతూ పోతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే ఎల్పీజీ ధర(lpg price)ను 50 రూపాయలు పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. సబ్సిడీ లేని సిలిండర్(non subsidised lpg sylinder) పై 25 రూపాయలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర 719 రూపాయలకు చేరింది.

ప్రస్తుతం పెరిగిన ధరతో 14 కేజీల సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.846.50కు చేరింది.

ఫిబ్రవరిలో మొత్తం మూడు సార్లు గ్యాస్(gas rates) ధరలు పెరిగాయి. మూడుసార్లు కలిపి దాదాపు 100 రూపాయల వరకు పెరిగింది.

ఇప్పటికే పెట్రోల్,నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ టైంలో గ్యాస్ ధరలపై నియంత్రణ ఎత్తేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక.. వెంట వెంటనే గ్యాస్ ధరలు పెరగడంపై ప్రజలు ఆందోళన పడుతున్నారు.

- తాతా ఇక నీ కష్టాలు గట్టేక్కినట్టే.. ముంబై ఆటో డ్రైవర్‌కు అండగా నిలిచిన నెటిజన్లు!

- ఉప్పెన సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ ఈమెనట.. !

- తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు.. త్వరలో.. ఎంతంటే..?

Next Story
Share it