Top
Batukamma

మరో దశాబ్దం ఇలాగే గడిస్తే ఈ దేశం వల్లకాడవుతుంది.!

మరో దశాబ్దం ఇలాగే గడిస్తే ఈ దేశం వల్లకాడవుతుంది.!
X
Highlights

జనం తిరగబడి విప్లవం తెచ్చి తుదముట్టించి సరికొత్త స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాత్వం, ప్రజాస్వామికం పుట్టేదాక.. రానీయండి

అవును ఈ రోజు కేసీయార్, రేపు జగన్, ఎల్లుండి నవీన్ పట్నాయక్.. ఇలా కేంద్రానికి జైకొట్టాల్సిందే. కేంద్రంకూడా మరొకరికి జైకొట్టాలసిందే.

సమస్యనే చెట్టు గురించి దాని కొమ్మల చివర్ల వద్ద మాట్లాడాలా? కాండం వద్ద నిలబడి మాట్లాడాలా? వేర్ల వద్ద పరిష్కరించాలా అనేది ఆలోచించాలి. నిజానికి ఒక విషవృక్షాన్ని వేర్ల దగ్గర తవ్వేయాలి. కనీసం కాండాన్ని నరికేయాలి.

ఈ కార్పొరేట్ శక్తులన్నీ ఈ దేశంలోని అన్నిచోట్లా చొచ్చుకుపోయి సారాన్ని పీల్చేసి మరీ బలమైన కాండాన్ని తయారుచేసుకున్నాయి కేంద్రప్రభుత్వం పేరిట. మీరు రాష్ట్ర ప్రభుత్వం అనే కొమ్మని నరికితే అక్కడ పది రోజులకల్లా కొత్త కొమ్మను కాండం పుట్టించుకోగలదు. కాండాన్నికాదని కొమ్మ మనగలిగే స్థితిలో లేదు.

జీఎస్టీ పేరిట మొత్తం రాష్ట్రాల వనరులన్నీ తనవద్దకు కాండం లాగేసుకుంది, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంటు వంటి పరిపాలనా విభాగాల్తో పాటు గవర్నర్ వంటి వేలిముద్ర పదవుల్ని కూడా కీలకంగా చేసుకుని జాతి భద్రత పేరుతో రాష్ట్రపాలనా విభాగాన్నంతా కాండం తన గుప్పెట్లోకి తెచ్చేసుకుంది. కీలకమైన మీడియాతో పాటు దేశసైన్యాన్నీ నియంత్రించడం ఎప్పుడైతే ఆరంభించిందో చిన్నా చితకా రాష్ట్రాలు చేసేదేమీలేదు. తమ చినంచిన్న కోరికలు ముందుయపెట్టి కాండానికి తలూపడం తప్ప.

ఈ క్రమంలో తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కుల నేతల్ని, రచయితలని నిర్బంధించడం వంటి చర్యలకు రాష్ట్రాల్ని నిందించడం కన్నా, అవి కేంద్రం చేతిలో నిస్సహాయ స్తితిలో నిలబడిన దుస్తితికి వగచడం మేలు.

కార్పొరేట్లకి కావలసింది వనరులమీద నియంత్రణ. అందుకోసం అవి ప్రభుత్వాల్ని నడుపుతాయి. అయితే తరాలుగా జతకల్సిన ఆర్థిక దోపిడీ, మత మద్దతు మరోసారి ఆధునిక కాలంలో వివ్జయవంతంగా మన నేలమీద సమన్వయం కుదుర్చుకున్నాయి. కార్పొరేట్లకు కావలిసిందివారికి దక్కుతోంది. మతశక్తులకు కావలసింది వారికి లభిస్తోంది. ఇదీ సంగతి.

మతం, దేశభక్తి పేరుతో మనకు తెలియకుండా చాల విధ్వంసం జరిగింది. వ్యవస్థలు నాశనమయ్యాయి. సైన్యాధికార్లు రాజకీయాలు మాట్లాడారు. సరిహద్దు వివాదాలు ఎన్నికల కోసం తయారయ్యాయి. ప్రజల చేతిలోని సొమ్ము చెల్లదు పొమ్మంటే సరేనన్నారు. ఫలానా తిండి తినకూడదన్నారు. ఫలానా దుస్తులని బట్టి వాళ్ల జీవితం నిర్ణయించారు. ఎవర్ని పెళ్లిచేసుకోవాలో నిర్ణయించారు. ఎదురు తిరిగిన బుద్దిజీవులు చంపబడ్డారు. జైళ్లలో కుక్కబడ్డారు. వేధించబడ్డారు. అసలేం జరుగుతోందో తెలియని సామాన్యజనం అయోమయంలో పడ్డారు. సగం చదువుగాళ్లంతా చోద్యం చూస్తూ, ఆటగాని పక్షం నిలబడి చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు.

రానీయండి.

మరో దశాబ్దం ఇలాగే గడిస్తే ఈ దేశం వల్లకాడవుతుంది.

దేశ రాజధానుల్లో, నగరాల్లో జరిగే విధ్వంసం వీధుల్లోకి, పల్లెల్లోకి, నట్టింట్లోకి చొరబడేదాక.

ఈ పర్తిస్థితి జనం తిరగబడి విప్లవం తెచ్చి తుదముట్టించి సరికొత్త స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాత్వం, ప్రజాస్వామికం పుట్టేదాక.. రానీయండి.. ఈ విధ్వంసం వేగంగా, బలంగా.. మన పునాదులు కదిలేలా!

.. Siddharthi Subhas Chandrabose

- జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!

- సీఎం జగన్ కు చుక్కలు చూపించబోతున్న బండి సంజయ్!

-

Next Story
Share it