Top
Batukamma

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్... గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అలర్ట్

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్... గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అలర్ట్
X
Highlights

గృహ వినియోగ గ్యాస్ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది కేంద్రం. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి (నవంబర్1) ప్రత్యేక భద్రతా ప్రమాణాలు అమలులోకి వచ్చాయి.

గృహ వినియోగ గ్యాస్ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది కేంద్రం. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి (నవంబర్1) ప్రత్యేక భద్రతా ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ వినియోగానికి సంబంధించి పలు నిబంధనలు మారుతున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ కలిగిన వారు ఈ నిబంధనలు ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి.

1. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, లేదంటే అడ్రస్ తప్పుగా ఉన్న వారు వెంటనే వాటిని అప్‌డేట్ చేసుకోవడం మంచిది. లేదంటే సిలిండర్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్లను అప్‌డేట్ చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు కస్టమర్లను కోరుతున్నాయి. లేదంటే సిలిండర్ ఆగిపోతుంది.

2. గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ ఓటీపీ చెబితేనే మీకు సిలిండర్ డెలివరీ చేస్తారు.

3. ఇండేన్ గ్యాస్ కూడా కంపెనీ బుకింగ్ నెంబర్‌ను మార్చేసింది. ఇదివరకు కంపెనీకి గ్యాస్ బుకింగ్‌కు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో నెంబర్ ఉండేది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు 7718955555 నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

4. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

దేశంలోని 100 స్మార్ట్ సిటీల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు అక్రమార్కుల చేతిలో పడకుండా ఇది ఉపయోగపడనుంది.

Next Story
Share it