Top
Batukamma

LPG PRICE: 5 రోజుల్లో రెండోసారి పెరిగిన గ్యాస్ ధర. ఇవాళ ఎంతంటే..?

LPG PRICE: 5 రోజుల్లో రెండోసారి పెరిగిన గ్యాస్ ధర. ఇవాళ ఎంతంటే..?
X
Highlights

ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు(lpg price) పెంచారు. ఒకసారి 50 రూపాయలు.. రెండు సార్లు 25 రూపాయల చొప్పున గ్యాస్ ధరలు పెంచారు.

వంట గ్యాస్ ధరలు(GAS PRICES) మరోసారి పెరిగాయి. ఎల్పీజీ(LPG) గ్యాస్ సిలిండర్(14.2కేజీలు) ధర 25 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత ఐదురోజుల్లో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి.

ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ ధర రూ.819, కోల్ కతాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835, హైదరాబాద్ లో 871.50కు చేరింది

ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు(lpg price) పెంచారు. ఒకసారి 50 రూపాయలు.. రెండు సార్లు 25 రూపాయల చొప్పున గ్యాస్ ధరలు పెంచారు. ఫిబ్రవరి 4న రూ.25, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న మరో 25 రూపాయలు పెంచారు.

అంతర్జాతీయ మార్కెట్ లో ప్రొపేన్(propane), బ్యూటేన్(butane) ధరలు పెరగడం, డాలర్ తో రూపాయి మారకం విలువలో మార్పుల కారణంగానే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ఓ వైపు ధరలు పెరుగుతున్నా.. గ్యాస్ పై ఇచ్చే సబ్సిడీని మాత్రం తగ్గించింది కేంద్రం. దీంతో చాలా తక్కువమొత్తంలో సబ్సిడీ(DBT) నగదు బ్యాంక్ అకౌంట్ లో పడుతోంది. ఒక్కో సిలిండర్ పై కేవలం 40 రూపాయలు మాత్రమే రీఫండ్ చేస్తున్నాయి కంపెనీలు.

Next Story
Share it