Top
Batukamma

ఆ ముఖ్యమంత్రికి సిగ్గూశరం లేదు.. ! దుమ్ముదులిపిన మహిళా ఎంపీ

ఆ ముఖ్యమంత్రికి సిగ్గూశరం లేదు.. ! దుమ్ముదులిపిన మహిళా ఎంపీ
X
Highlights

యువతుల వస్త్రధారణ పైన కామెంట్స్ చేసిన ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరథ్ రావత్ సింగ్ పైన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా విరుచుకుపడ్డారు.

యువతుల వస్త్రధారణ పైన కామెంట్స్ చేసిన ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరథ్ రావత్ సింగ్ పైన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా విరుచుకుపడ్డారు. ఆయనకీ సిగ్గూశరం లేదంటూ ఘాటుగా విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి.. ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

అటు సీఎం వ్యాఖ్యల పట్ల నటి, రాజకీయ నేత జయా బచ్చన్‌ కూడా స్పందించారు. దుస్తుల ఆధారంగా ఎవరు ఎలాంటి వారో మీరేలా నిర్ణయిస్తున్నారు. మహిళలపై నేరాలను ఇలాంటి వ్యాఖ్యలే ప్రేరేపిస్తాయని అన్నారు. వెంటనే తీరథ్ రావత్ సింగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు..

కాగా మహిళలు చిరిగిన జీన్స్ ధరించి, తాము ధనవంతులైన బిడ్డలుగా భావిస్తున్నారని సీఏం రావత్‌ మంగళవారం విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా యువత రిప్ప్‌డ్‌ జీన్స్‌ కోసం మార్కెట్‌కు వెళుతున్నారని, అక్కడ అవి లభ్యం కాకుంటే కత్తెరలతో జీన్స్‌ను కట్‌ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇందులో మహిళా యువత ముందున్నారని అన్నారు. ఇలా వేసుకోవడం వలన వల్ల లైంగిక వేధింపులు, డ్రగ్స్ వంటి పెడధోరణులకు బీజం వేస్తుందన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.

Next Story
Share it