Top
Batukamma

మూడు ముళ్లకు ఒప్పుకోలేదని నాలుగు కత్తిపోట్లు..!

malvi malhotra attacked with knife
X
Highlights

నటీ మాల్వి మల్హోత్రా ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెకు పరిచయమున్న వ్యక్తే కత్తితో పొడిచాడు.

Malvi malhotra attacked with knife : మనుషులు విచక్షణను కోల్పోతున్నారు. చిన్నచిన్న వాటికే ఏకంగా హత్యలు చేసేస్తున్నారు. తాజాగా టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. పెళ్ళికి నిరాకరిచిందన్న కోపంతో ఆమె పైన ఓ వ్యక్తి దాడికి దిగాడు. అయితే ఈ దాడిలో మాల్వీ మల్హోత్రా తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

దాడి చేసిన వ్యక్తిని కుమార్ మహిపాల్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. నటి మాల్వీ మల్హోత్రా ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం సోమవారం రాత్రి మాల్వీ తన ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

కారులో ఇంటికి వెళ్తున్న నటిని కుమార్ మహిపాల్ సింగ్ అడ్డుకొని తనని ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించాడు. అలా అలా ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సహనం కోల్పోయిన కుమార్ మహిపాల్ సింగ్... మాల్వీ పొట్టలో కత్తితో దాడి చేసి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడ్డ నటిని ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తి ఇండస్ట్రీలో ఓ నిర్మాత అని పోలీసుల విచారణలో తేలింది. ఇక అతనితో మాల్వీ మల్హోత్రా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడిందని పోలీసులు అంటున్నారు.

నటి మాల్వీ మల్హోత్రా (Malvi malhotra) ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం నిందితుడు పైన ఐపీసీ సెక్షన్‌ 307తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇక మాల్వీ మల్హోత్రా కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

- సానియా మీర్జా ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం..!

- ఆ.... ఇంకెవరైనా మిగిలారా..? బీజేపీకి ఓట్ల వరదేనా ఇక..?

- సంజయ్ అంటే పోలీసులకు ఎందుకు పడటం లేదు..?


Next Story
Share it