Top
Batukamma

అసలే దిక్కులేదంటే.. అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్.. నువ్ గ్రేట్ చందూ..!

అసలే దిక్కులేదంటే.. అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్.. నువ్ గ్రేట్ చందూ..!
X
Highlights

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఓ పది నిమిషాలు సెంటిమెంట్ సీన్ నడుస్తుంది.

Man marries two women on same day in Chhattisgarh : సినిమాల్లో పెళ్లి సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. సరిగ్గా తాళి కట్టే టైంలో... ఆపండి.. అంటూ ఓ లేడీ ఎంట్రీ ఇస్తుంది. నన్ను ప్రేమించాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు. దయచేసి నాకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఓ పది నిమిషాలు సెంటిమెంట్ సీన్ నడుస్తుంది. చివరకు ఆ వచ్చిన అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తారు. కథ సుఖాంతం అవుతుంది.

కానీ రియల్ లైఫ్ లో ఈ మధ్య కాలంలో ఇంతకుమించిన స్టోరీలు నడుస్తున్నాయి. సరిగ్గా పెళ్లి టైంకి పెళ్లి కూతురు మాయమవడం.. అక్కడున్న వేరే అమ్మాయితో అతనికి పెళ్లి చేయడం.. కొన్ని సార్లు పెళ్లి కొడుకు మాయం అవడం.. అక్కడే ఉన్న వేరే అబ్బాయికి పెళ్లి చేయడం ఇలాంటి సీన్లు ఇటీవలి కాలంలో రొటీన్ అయిపోయాయి.

అయితే.. చత్తీస్ గఢ్ లో మాత్రం ఓ డిఫరెంట్ సీన్ కనిపించింది. ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు.. వాళ్లిద్దరిని ఒకేసారి పెళ్లి చేసున్నాడు. అమ్మాయిలు అంతలా వెంటపడ్డారంటే అతనేడో కోటీశ్వరుడు కాదు. సాధారణ రైతు.

చత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా జగదల్పూర్ దగ్గరున్న తిక్రాలొహంగాకు చెందిన చందూ మౌర్య వ్యవసాయం చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం తొకపాల్ గ్రామానికి కరెంట్ స్తంభాలు వేసే పనికి వెళ్లాడు. అక్కడ గిరిజన యువతి సుందరి కశ్యప్‌ తో పరిచయం అయ్యింది అదికాస్తా ప్రేమగా మారింది.

ఇంకేముంది.. ఫోన్లు ముచ్చట్లు.. చాటుమాటుగా కలుసుకోవడాలు జరిగిపోతూనే ఉన్నాయి.

అయితే.. ఏడాది క్రితం మరో సంఘటన జరిగింది. తిక్రాలొహంగా గ్రామంలో ఓ పెళ్లికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె పేరు హసీనా బాగేల్. ఆ అమ్మాయిని చూసిన మనోడికి మనసాగలేదు. ముచ్చటగా రెండోసారి ప్రేమలో పడ్డాడు. ఆ హసీనాకు కూడా ఇతగాడు పిచ్చపిచ్చగా నచ్చేశాడట.

ఇంకేముంది.. మళ్లీ సేమ్ సీన్.. ఫోన్లు.. ముచ్చట్లు.. సడెన్ గా ఓ రోజు హసీనా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది. అయితే మనోడు ఇక్కడ నిజాయితీగా వ్యవహరించాడు. ఆల్రెడీ సుందరితో ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పాడు. అయినా హసీనా మాత్రం చందూపై ప్రేమను చంపులేకపోయింది. తరుచూ మాట్లాడుతూనే ఉండేది. ఇంట్లోవాళ్లు హసీనాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో చెప్పపెట్టకుండా చందూ ఇంటికి వచ్చేసింది. తనతోనే ఉంటానని చెప్పింది. విషయం తెలుసుకున్న మనోడి ఫస్ట్ లవర్ సుందరి కూడా ఇంటికి పరుగెత్తుకొచ్చింది.

చందూను వదిలేది లేదని ఇద్దరూ భీష్మించుకు కూర్చున్నారు. కొద్దిరోజులు అలాగే ఉన్నారు. ఈ గ్యాప్ లో ఇద్దరూ ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారు. తమ ఇద్దర్ని పెళ్లి చేసుకోవాలని చందూను కోరారు సుందరి, హసీనా. మీకే అభ్యంతరం లేనప్పుడు నాకేంటి ఇబ్బంది అనుకున్నాడో ఏమో.. వెంటనే ఓకే చెప్పేశాడు.

అతని ఇంట్లో వాళ్లు కూడా ఓకే చెప్పడంతో.. ఇద్దరు అమ్మాయిల పేర్లతో పెళ్లి కార్డు కొట్టించి.. బంధువులందర్ని పిలిచి మరీ గ్రాండ్ గా పెళ్లి చేశారు.

- ఎవడైనా కర్రతో కొడతాడు.. వీడేంట్రా ఇలా అందంతో, కెమెరా యాంగిల్స్ తో కొడుతున్నాడు

- బద్మాష్ సంజయ్.. బలిసిందా...! మల్లిగా చమ్డల్ తీస్తా బిడ్డా..! బాల్క సుమన్ ..

- యాంకర్ రవి ప్రేమ, పెళ్లి.. ఓ ఆసక్తికరమైన మోసం!

Next Story
Share it