దురద వీరుడు.. ఏకంగా జేసీబీతో వీపు గోకించుకున్నాడు!

Man Uses JCB Excavator : సహజంగా అయితే మనకు వీపు దురద పెడితే ఏం చేస్తాం.. అందరూ చెప్పే సమాధానమే గొక్కుంటాం అని... బాగా దురద పెడితే మన చేతులతో గొక్కుంటాం..
Man Uses JCB Excavator : సహజంగా అయితే మనకు వీపు దురద పెడితే ఏం చేస్తాం.. అందరూ చెప్పే సమాధానమే గొక్కుంటాం అని... బాగా దురద పెడితే మన చేతులతో గొక్కుంటాం.. అందకపోతే దువ్వెన సహాయంతోనో లేదా కర్ర సహాయంతోనో గొక్కుంటాం.. కానీ ఇక్కడ ఓ మనిషి మాత్రం వింతగా జేసీబీతో గోకించుకున్నాడు..
నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా నిజమేనండి... ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... తవ్వకాల పనుల్లో ఉండగా అక్కడ పనిచేసే కూలీకి బాగా దురద పెట్టింది... పాపం తన ప్రయత్నం తాను చేశాడు కానీ... దురద మాత్రం తగ్గలేదు. ఇలా అయితే తగ్గేలా లేదని అనుకోని పక్కనే ఉన్న జేసీబీ ఆపరేటర్‌ను పిలిచి జేసీబీతో తన వీపు గోకాలని అడిగాడు..
పాపం మనోడు బాధను అర్థం చేసుకున్న ఆ జేసీబీ ఆపరేటర్ అతని వీపును జేసీబీతో గోకాడానికి సిద్దం అయ్యాడు. జేసీబీ ముందు వినయంగా వంగుని.. దాని పదునైన ఇనుప పళ్లతో గోకించుకున్నాడు సదరు కూలీ.. అప్పుడు కానీ అతని దురద పోలేదు.. కేరళలో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను నవ్వులు పూయిస్తుంది..