Top
Batukamma

అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !

అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !
X
Highlights

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 10 లక్షల కోట్లు అదనంగా వసూలు చేసింది. గత ప్రభుత్వ అప్పులు ఎన్ని తీర్చిందో చెబితే బాగుంటుంది.

కేంద్రానికి 2014 లో ఇంధనం మీద వార్షిక పన్నుల ద్వారా 99 వేల కోట్లు వచ్చేది. ప్రస్తుతం 2 లక్షల 40 వేల కోట్లుగా ఉంది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 10 లక్షల కోట్లు అదనంగా వసూలు చేసింది. గత ప్రభుత్వ అప్పులు ఎన్ని తీర్చిందో చెబితే బాగుంటుంది.

2014 పెట్రోల్ మీద excise సుంకం 9.48 ఉండేది. ప్రస్తుతం పెట్రోల్ మీద 32.98 పైసలు ఉంది. డీజిల్ మీద 3. 56 ఉండేది ప్రస్తుతం 31. 83 ఉంది. ఇది గత ప్రభుత్వానికి ఏమి సంబంధం? డీజిల్ మీద 900% పెట్రోల్ మీద 350% పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల మీద 14% కేంద్రానికి వెళ్ళేది. ప్రస్తుతం 38% కు పెరిగింది. రాష్ట్రాల వాటా 17% ఉండేది ప్రస్తుతం 23% గా ఉంది.

గత ప్రభుత్వం ఇంధన దిగుమతులమీద ద్రుష్టి పెట్టలేదు అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఇంధన వినియోగం తగ్గిందా? ప్రజా రవాణా వ్యవస్థ మెరుగు పరిచారా? ఇంధన వినియోగం తగ్గించే చర్యలు ఎం తీసుకున్నారు? వీటన్నిటి గురించి ప్రజలకు చెబితే అప్పుడు గత ప్రభుత్వాన్ని నిందించవచ్చు.

Gondi Kaveender Reddy


Next Story
Share it