Top
Batukamma

modi video conference : మళ్లీ లాక్ డౌన్ పెడతారా..? ఇవాళే క్లారిటీ..!

modi video conference : మళ్లీ లాక్ డౌన్ పెడతారా..?  ఇవాళే క్లారిటీ..!
X
Highlights

ఫస్ట్ వేవ్ కంటే కూడా.. ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీన రోజువారీ కేసులు లక్ష దాటాయి.

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే కూడా.. ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీన రోజువారీ కేసులు లక్ష దాటాయి.

రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడి చర్యలు మొదలు పెట్టాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

దీంతో కరోనా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

లాక్ డౌన్ పరిస్థితులు లేకుండా వైరస్ నుంచి బయటపడటమే లక్ష్యంగా మోడీ మీటింగ్ జరగబోతోందని తెలుస్తోంది.

రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది..? వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోందని అడిగి తెలుసుకోనున్నారు ప్రధాని. అలాగే పాక్షిక లాక్ డౌన్ పెడితే ఎలా ఉంటుందనే దానిపై సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

వీటితో పాటుమరిన్ని అంశాలపై ఇవాళ్టి భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

మీటింగ్ పూర్తయ్యాక ఇవాళ రాత్రి వరకు కేంద్ర హోంశాఖ నుంచి కరోనాకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

- Allu arjuns Pushpa Teaser :పుష్ప టీజర్

- తెలుగు సినిమోళ్లు జంగల్ వట్టిన్రు..!

- హమ్మ శ్యామలా..? ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..!

Next Story
Share it