Top
Batukamma

కొత్త పార్లమెంట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

కొత్త పార్లమెంట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
X
Highlights

నాలుగు అంతస్తులుగా, త్రిభుజాకారంలో ఈ భవనం ఉండనుంది. ఇంటీరియర్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.

New parliament building : భారత పార్లమెంట్ కొత్త భవనానికి ప్రధాని మోడీ(modi) శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(central vista) కింద ఈ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 20 వేల కోట్లు. కేవలం పార్లమెంట్(parliament) భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు 971కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పాత పార్లమెంట్ భవనానికి పక్కనే.. రాష్ట్రపతి భవన్(rashtrapathi bhavan) కు సమీపంలో 64వేల500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించనున్నారు. 2022 ఆగస్ట్ 15 కల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజుతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది.

నాలుగు అంతస్తులుగా, త్రిభుజాకారంలో ఈ భవనం ఉండనుంది. ఇంటీరియర్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఇంటీరియర్ లో జాతీయ చిహ్నాలైన కమలం, నెమలి, మర్రిచెట్టు ప్రతిరూపాలు ఉండనున్నాయి.


లోక్ సభ ఇంటీరియర్ అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. లోక్ సభ(loksabha) సీలింగ్ పురవిప్పిన నెమలి ఆకారంలో, రాజ్యసభ(rajyasabha) సీలింగ్ విరభూసిన కమలం ఆకారంలో ఉండనున్నాయి. ఇక సెంట్రల్ లాంజ్ లో మర్రిచెట్టు ఆకృతి కనిపించనుంది.


బిల్డింగ్ పైన కిరీటం లాగా నాలుగు సింహాల ఎంబ్లమ్ పెట్టనున్నారు. సెట్రల్ హాలులో దేశ చరిత్ర, గొప్పదనాన్ని తెలిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక భవన నిర్మాణంలో ధోల్ పూర్ స్టోన్ వాడనున్నారు.


ఆడియో వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నారు. ఇకపై స్మార్ట్, ప్రోగ్రామ్డ్ ఆడియో సిస్టం పెట్టనున్నారు. దీని ద్వారా సభ్యుల ఆడియో క్లియర్ గా వినిపించడంతో పాటు.. స్పీకర్ మేనేజ్ చేయడానికి వీలుగా ఉండనుంది.

దీనిని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్(tata projects ltd) నిర్మించబోతోంది. పాత పార్లమెంట్ భవనాన్ని మ్యూజియంగా మార్చనున్నారు.

- Srireddy on niharika marriage: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి..!

- Horoscope Today : 11-12-2020 శుక్రవారం నేటి రాశిఫలాలు

- విశ్లేషణ: ఈ మగాడిదల బుద్ధి ఇంతేనా..? వాడూ మగాడూ.. వీడూ మగాడే..!

Next Story
Share it