Top
Batukamma

మన దేశానికి బీజేపీ చాలా అవసరం.. ఎందుకంటే?

మన దేశానికి బీజేపీ చాలా అవసరం.. ఎందుకంటే?
X
Highlights

16వ శతాబ్దం నుండి యూరోప్ లో శాస్త్ర సాంకేతిక స్పృహ పెరగడం వల్ల కొత్త కొత్త పరికరాలు(steam engine లాంటివి) అందుబాటులోకి వచ్చి పారిశ్రామిక విప్లవం మొదలయింది

మన దేశానికి బీజేపీ పార్టీ చాలా అవసరం, మన భవిష్యత్తు కోసం మోడీ, అమిత్ షా, యోగి అదిత్యనాథ్ లాంటి గొప్ప నాయకులు ఎంతో అవసరం. ఎందుకంటే..

16వ శతాబ్దం నుండి యూరోప్ లో శాస్త్ర సాంకేతిక స్పృహ పెరగడం వల్ల కొత్త కొత్త పరికరాలు(steam engine లాంటివి) అందుబాటులోకి వచ్చి పారిశ్రామిక విప్లవం మొదలయింది, ఈ పారిశ్రామిక విప్లవం వల్ల యూరోప్ లో వీపరితమైన ఆర్ధిక వృద్ధి పెరిగిపోయింది. ఈ ఆర్ధిక వృద్ధి వల్ల విప్లవాత్మకమైన సామాజిక మార్పులు జరిగాయి. ఈ సామాజిక మార్పుల్లో భాగంగా సమాజంలో భయంకరమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఒక వైపు దేవుడు, మతం, మూఢ నమ్మకాలు, బానిసత్వం ఇంకో వైపు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్ధిక వృద్ధి రేటు వాటి వల్ల జీవన ప్రమాణాలు పెరగడం లాంటివి రెండు భిన్న ధృవలు ఏర్పడ్డాయి. సమాజంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలయింది. మనిషి ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందు వెళ్లిన సరే తనని ఒక చిన్న తాడుతో కట్టిపడేసేది దేవుడు, మతం, మూఢ నమ్మకాలు మాత్రమే దీనికి కారణం మనిషిలో ఉండే భయాలు, ఇగోలు మాత్రమే. చావు - పుట్టుక, పాపం - పుణ్యం, స్వర్గం - నరకం లాంటి విషయాలు మనిషిని మానసిక బానిసల్ని చేస్తాయి కాబట్టి ఆ రోజుల్లో అక్కడి ప్రజలు ఒకేసారి దేవుడు, మతం, మూఢనమ్మకాల దశ నుండి విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు మారడానికి చాలా ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ వాతావరణం వల్ల ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలు జరిగాయి కూడా. ప్రపంచ చరిత్రలో 17,18,19వ శతాబ్దంలో యూరోప్ లో జరిగినంత రక్తపాతం, హింస, జాతి వైరం, ఘర్షణలు మరెక్కడా జరగలేదేమో.

"యుద్ధం తర్వాత శాంతి నెలకొంటుంది" అని అంటుంటారు. అలాగే యూరోప్ లో కూడా రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఆల్మోస్ట్ అన్ని దేశాలు శాంతి గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడడం మొదలుపెట్టాయి. చాలా దేశాల్లో దేవుడు కానీ మతం కానీ లేవు ఇప్పుడు. ప్రపంచంలో అత్యంత peaceful countries ఏవైనా ఉన్నాయి అంటే అవి యూరోప్ దేశాలే. వాళ్లకు ఈ ముక్క అర్ధం అవ్వడానికి ఎన్నో civil wars జరిగాయి, ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. యూరోప్ మొత్తం రక్తంతో తడిచి ముద్ద అయింది.

మన భారత దేశం కూడా ఇప్పుడు దేవుడు, మతం, మూఢనమ్మకాలు, అజ్ఞానం అనే దశ నుండి next level అయిన విద్య, విజ్ఞానం, శాస్త్రీయత, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ అనే దశకు మార్పు చెందుతుంది. ఇప్పుడు మనం transition phase లో ఉన్నాం కాబట్టి ఈ old order and new order మధ్య ఇర్రుకోని వీపరితమైన ఘర్షణ ఎదురుకుంటున్నాం. అజ్ఞానం, నిరక్షరాస్యత, మూఢత్వం, మూర్ఖత్వం ఎక్కువ ఉండే మన లాంటి conservative societies లో ఈ ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. యూరోప్ లో జరిగినట్టు ఇక్కడ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చి, ఆల్మోస్ట్ ఒక civil war లాంటి movement వస్తే గానీ ఈ సమాజం ఒక గాడిన పడదు. మరి అలాంటి ఉద్యమం, అలాంటి పరిస్థితులు, అలాంటి సివిల్ వార్ రావాలంటే ప్రజలు తీవ్రంగా అణిచివేయబడలి. ప్రజలు విద్యకు, ఉద్యోగాలకు, స్వేచ్ఛకు దూరం చేయబడాలి. ప్రజలకు గట్టి చురుకు తగలాలి. ప్రతి ఒక్కరికి గట్టి దెబ్బ తగాలలి. అలాంటి పరిస్థితులు రావాలంటే మనకు మోడీ, అమిత్ షా, యోగి అదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఎంతో అవసరం.

Abraham maslow ప్రతిపాదించిన theory of self actualization ప్రకారం మనిషి తాను నమ్మే దేవుడ్ని, మతాన్ని, తన జాతిని తన అస్థిత్వంగా, తన ఆత్మ గౌరవంగా భావిస్తాడు కాబట్టి ఈ దేవుడు మతం జాతి అనే సున్నితమైన అంశాలను ఎవరు రెచ్చగొట్టిన వాళ్లకు బానిసగా మరిపోతాడు.

ఈ మధ్య కాలంలో భారత ఉపకండంలో ఈ మత ఘర్షణలు చూస్తున్నం కానీ ఒకప్పుడు ఇలాంటి మత ఘర్షణలు యూరోప్ లో నిత్యం జరిగేవి, యుదులకు, నాజీలకు మధ్య జరిగిన ఘర్షణ వల్లే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అంటే బహుశా ఎవరు నమ్మరు ఏమో...ఈ రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు అని చెప్పిన నమ్మారెమో...

యూరోప్ లో ప్రజలు యుద్ధాల తర్వాత, రక్త పాతాల తర్వాత ఇప్పుడు శాంతితో, స్వేచ్ఛగా ఎలా బ్రతుకుతున్నారో మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. కాకపోతే బీజేపీ లాంటి fascist parties ఇంకో 25 నుండి 30 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి, ఈ దేశ ప్రజలకు ద్వేషాన్ని, పగని, రక్త పాతాన్ని, అశాంతిని, బానిసతత్వాని రుచి చూపించి. ప్రపంచం అంతా ముందుకు దూసుకుపోతుంటే మనం మాత్రం పేదరికం, నిరుద్యోగం, ఆకలితో వెనకబడిపోయి. మానవ హక్కులు మంట కలిసిపోయిన రోజు, ఈ దేశ పౌరులు మతానికంటే మానవత్వం గొప్పది. దేవుడికంటే మనిషి గొప్పవాడు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. బానిసత్వం కంటే స్వేచ్ఛ గొప్పది. అణిచివేత కంటే అభివృద్ధి, స్వాతంత్రం గొప్పవి అని తెలుసు కుంటారు.


Source : Facebook

Next Story
Share it