Top
Batukamma

లైంగిక ఆరోపణలు చేసిన నటికి బీజేపీలో కీలక పదవి!

లైంగిక ఆరోపణలు చేసిన నటికి బీజేపీలో  కీలక పదవి!
X

Payal Ghosh joins Union minister Ramdas Athawale-led Republican Party of India

Highlights

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్మప్ పై లైంగిక ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ కొద్దిసేపటి క్రితమే రాజకీయ ప్రవేశం చేశారు. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)లో ఆమె చేరారు.

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్మప్ పై లైంగిక ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ కొద్దిసేపటి క్రితమే రాజకీయ ప్రవేశం చేశారు. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)లో ఆమె చేరారు. ముంబైలో అథవాలే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మహిళా విభాగానికి పాయల్ ఘోష్ ను ఉపాధ్యక్షురాలిగా నియమించారు. 2011 నుంచి అథవాలే పార్టీ.. NDA భాగస్వామిగా కొనసాగుతోంది.

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్మప్ పై లైంగిక ఆరోపణలు చేసి ఒక్కసారిగా ఫేం అయింది నటి పాయల్ ఘోష్ .. అనురాగ్ కశ్యప్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశ రాజధానిలోని జాతీయ మ‌హిళా క‌మిషన్‌ను కలిశారు. అంతేకాకుండా తనకి ప్రాణ హనీ ఉందని ఆమె ప్రధాని మోడీకి పలుమార్లు ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇంకా కేసు నడుస్తోంది.



ఈ క్రమంలో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా అనురాగ్ కశ్యప్‌పై కక్షసాధింపు చర్యలకు పాయల్ ఘోష్ దిగుతారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. అటు గత కొద్దిరోజులుగా పాయల్ రాజకీయాల్లోకి రానున్నారన్న ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.. నురాగ్ కశ్మప్ పై లైంగిక ఆరోపణలు చేసినప్పుడు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి, ఆర్‌పిఐ చీఫ్ రామ్‌దాస్ అథవాలే పాయల్ ఘోష్‌కు మద్దతు ఇచ్చారు.

Next Story
Share it