Top
Batukamma

PETROL PRICES: వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ధరలు..!

PETROL PRICES MAY COME DOWN SOON
X
Highlights

ప్రస్తుత పరిస్థితులు చూస్తే పెట్రోల్ రేట్లు తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

PETROL PRICES MAY COME DOWN SOON : పెట్రోల్(PETROL), డీజిల్(DIESEL) వినియోగదారులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. భారీగా పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ రేట్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం దేశంలో ఇంధన రేట్లు ఆల్ టైం హై కి చేరాయి. ఇప్పటికే దేశంలోని చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర(PETROL PRICE) 100 రూపాయలు దాటింది. హైదరాబాద్ లో 95రూపాయలకు కాస్త అటూ ఇటుగా ఉంది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తే పెట్రోల్ రేట్లు తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే.. ప్రజలపై తీవ్రమైన భారం పడుతుండటం.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో.. ధరలు తగ్గించే ఆలోచనలో ఉందట కేంద్ర ప్రభుత్వం. దీనికోసం సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది.

గతేడాది క్రూడాయిల్(CRUDE OIL) ధరలు 20 డాలర్లకు పడిపోయినా.. మనదేశంలో మాత్రం పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గలేదు. దీనికి కారణం ట్యాక్స్(TAXES ON FUEL) లు పెంచడం. పెట్రో ఉత్పత్తులపై గత ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు ట్యాక్స్ లు పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో 5.56 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది.

ట్యాక్స్ లు పెంచడం ధరల పెరుగుదలకు ఓ కారణమైంది.

ఇప్పుడు ఆ ట్యాక్స్ లను తగ్గించేందుకు సంప్రదింపులు జరుపుతోందట కేంద్రం. రాష్ట్రాలతో, ఆయిల్ కంపెనీల(OIL COMPANIES)తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ట్యాక్స్ ల భారాన్ని తగ్గిస్తే.. ఇంధన ధరలు ప్రజలకు కాస్త అందుబాటులోకి వస్తాయని.. తమపై వస్తున్న నెగెటివ్ ఇంపాక్ట్ కూడా పోతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంధన ధరల అంశంపై ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల సమాఖ్య(OPEC) సమావేశంలోనూ మాట్లాడాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వీకెండ్ లో జరగనున్న సమావేశంలో ధరల అంశం చర్చకు రానుంది.

చర్చలు సక్సెస్ అయితే.. మార్చి ఎండింగ్ కల్లా వాహనదారులు గుడ్ న్యూస్ వినొచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

- పైన పటారం.. లోన లొటారం.. యాంకర్ అనసూయ రచ్చ రచ్చ.. !

- అయ్యా.. ! చంద్రశేఖర్ యేలేటి.. ఈ ప్రశ్నలకి 'చెక్' పెట్టగలవా?

- ఈషా రెబ్బా.. ఈ ఫోటోలు అదిరయబ్బా.. !

- తప్పతాగి దొరికి మళ్ళీ నీతులు... పోలీసుల అదుపులో యూట్యూబ్‌ స్టార్ షణ్ముఖ్‌!

- ఓ రేంజ్ లో రెచ్చిపోయిన సమంత అక్క.. !

Next Story
Share it