Top
Batukamma

గుడ్ న్యూస్ : మనకూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!

గుడ్ న్యూస్ : మనకూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
X
Highlights

వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. అయితే.. మన దగ్గర మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో తయారుకాలేదు.

Pfizer Seeks Approval In India For Covid Vaccine: కరోనా(corona) వ్యాక్సిన్ కు సంబంధించి మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవలే బ్రిటల్ లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అప్రూవల్ అయ్యింది. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. అయితే.. మన దగ్గర మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో తయారుకాలేదు.

బ్రిటన్(united kingdom) లో అప్రూవ్ అయిన వ్యాక్సిన్ ను భారత్ తెచ్చేందుకు ఫైజర్(Pfizer) కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వాలని బారత డ్రగ్ కంట్రోల్ జనరల్(dcgi) కు అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ బ్రిటన్, బహ్రెయిన్ లో వాడుతున్నారు.

వ్యాక్సిన్ ను బ్రిటన్ నుంచి దిగుమతి చేసి.. భారత్ లో విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే.. క్లినికల్ ట్రయల్స్ నుంచి మాత్రం మినహాయింపు ఇవ్వాలని.. ఈ నెల 4న పెట్టుకున్న అప్లికేషన్ లో కోరింది.


అయితే.. వ్యాక్సిన్ భారత్ లో విక్రయించాలంటే మొదట క్లినికల్ ట్రయల్స్(clinical trails) నిర్వహించాలి. ఇక్కడి ఏదైనా సంస్థతో కలిసి వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇక్కడి ప్రజల శరీరానికి వ్యాక్సిన్ సరిపోయింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకున్నప్పుడే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ ఫైజర్ మాత్రం ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరుతోంది. ఖచ్చితంగా ట్రయల్స్ చేయాలని రూల్ ఉన్నా.. దీనిపై నిర్ణయం తీసుకునే విశేష అధికారాలు డ్రగ్ కంట్రోల్ జనరల్ కు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ.. ట్రయల్స్ అవసరం లేదని చెబితే.. మనకూ వారం పది రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

- Daily horoscope telugu :06-12-2020 ఆదివారం నేటి రాశిఫలాలు

- సిల్క్ స్మితగా అనసూయ.. పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్!

- వర్షను భీభత్సంగా వాడేస్తున్న మల్లెమాల.. మరీ ఇంతలానా?

Next Story
Share it