Top
Batukamma

చైనా, పాకిస్థాన్ తో యుద్ధానికి ముహూర్తం పెట్టిన మోడీ..!

చైనా, పాకిస్థాన్ తో యుద్ధానికి ముహూర్తం పెట్టిన మోడీ..!
X
Highlights

చాలా కాలంగా చైనా, పాకిస్థాన్ తో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం తప్పదనే మాట వినబడుతోంది.

War With China, Pak : భారత్-చైనా మధ్య కొద్ది రోజులుగా సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నిసార్లు చర్చలు జరిగినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రతినిత్యం రెండు దేశాల సైనికుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం.

చైనా రెచ్చిపోతే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాల అధిపతులు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ప్రకటనలు చేస్తున్నారు. సరిహద్దు విధుల్లో ఉన్న అధికారులు కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు.

ఇక.. చైనా, పాకిస్థాన్ తో యుద్ధం చేసి బుద్ధి చెబుతామని బీజేపీ నేతలు ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే.. ఈ సారి ఓ బీజేపీ నేత మరో అడుగు ముందుకేశారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్థాన్ తో యుద్ధం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేశాడని అన్నాడు.


యూపీలోని ఓ లీడర్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. యుద్ధానికి ముహూర్తం రెడీ అయ్యిందని ఈ మీటింగ్ కు సంబంధించిన వీడియోలో చెప్పారు.

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

అక్కడితో ఆగని స్వతంత్ర దేవ్ సింగ్.. అపోజిషన్ పార్టీలపైనా ఫుల్ ఫైర్ అయ్యారు. బహుజన్ సమాజ్, సమాజ్ వాదీ పార్టీల కార్యకర్తలను టెర్రరిస్టులుగా సంభోదించారు.

అయితే.. ఆదివారం రోజున డార్జిలింగ్ లో మాట్లాడిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం.. తామ చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. అయితే.. ఒక్క ఇంచ్ భూమిని కూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పారు.

మంచి సంబంధాలు కోరుకుంటున్నామని రక్షణమంత్రి రాజ్ సింగ్ చెబుతోంటే.. బీజేపీ యూపీ ప్రెసిడెంట్ మాత్రం యుద్ధానికి డేట్ (War With China, Pak) ఫిక్స్ అయ్యిందని చెబుతున్నారు.

Read Also :

Next Story
Share it