Top
Batukamma

రైతులకి మోడీ షాక్.. ఇక ఆ 33 లక్షల మందికి రూ. 6 వేలు రానట్టే లెక్క!

రైతులకి మోడీ షాక్.. ఇక ఆ 33 లక్షల మందికి రూ. 6 వేలు రానట్టే లెక్క!
X
Highlights

మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల మంది అనర్హులు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. ఇప్పటివరకు కేంద్రం వారికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు వెలువడ్డాయి.

దేశంలోని రైతులను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి అనే స్కీమ్ ని ముందుకు తీసుకువచ్చింది. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ స్వయంగా ఈ పధకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పధకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి రూ.6 వేలు అందుతాయి.

ఈ డబ్బులను మొత్తం మూడు విడతల్లో అంటే రెండు వేల చొప్పున కేంద్రం అందిస్తోంది. ఈ పధకం వల్ల రైతులకి చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. అయితే ఇందులో కొందరు అనార్హ్హులు కూడా ఈ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నారని కేంద్రం గుర్తించింది.

మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల మంది అనర్హులు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. ఇప్పటివరకు కేంద్రం వారికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు వెలువడ్డాయి.

ఇప్పటివరకు ఈ పధకం కింద లబ్ది పొందుతున్నారకి ఇక పై ఆ రూ.6,000 రానట్టే లెక్క.. అయితే ఇందులో మీరున్నారో లేదా తెలుసుకోండి ఇలా.. ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్ళండి.. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి.. ఆ తర్వాత బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల సాయంతో మీరు లిస్ట్ పొందొచ్చు. ఒకవేళ ఇందులో మీ పేరు ఉంటే మీకు డబ్బులు యధావిధిగా వస్తాయి. లేకపోతే రావు. ఇంకా ఈ స్కీమ్ లో మీరు చేరకుంటే చేరొచ్చు కూడా.. దీనికి కేవలం ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పొలం పాస్ బుక్ ఉంటే సరిపోతుంది.

Next Story
Share it