Top
Batukamma

బ్రాండ్ వాల్యూలో నంబర్ వన్ మోడీ.. సెకండ్ ప్లేస్ లో వైఎస్ జగన్.

బ్రాండ్ వాల్యూలో నంబర్ వన్ మోడీ.. సెకండ్ ప్లేస్ లో వైఎస్ జగన్.
X
Highlights

మోడీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

PM Modi led 'Trends' across social media: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రికార్డు సృష్టించారు. ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్ లో మోడీ పేరే ట్రెండింగ్ లో ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ లో ఎవరున్నారనే వివరాలను చెక్ బ్రాండ్స్ అనే సంస్థ ప్రకటించింది.

3 నెలల్లో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 500 మంది ఎఫెక్టీవ్ పర్సన్స్ కు సంబంధించిన డేటాను ఆ సంస్థ వెల్లడించింది.

ఆన్ లైన్ లో 10 కోట్ల ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోడీ పేరుపైననే ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌ తో మోడీ తొలి స్థానంలో నిలిచారు.

మోడీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.

70 బ్రాండ్ స్కోర్‌ తో మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 36.43 స్కోర్‌ తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ (31.89), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(27.03) ఉన్నారు.

బ్రాండ్ వాల్యూలో మోడీని ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ దాదాపు 336 కోట్ల రూపాయలుగా ఉంది. అమిత్ షా బ్రాండ్ వాల్యూ 335 కోట్లు, కేజ్రీవాల్ బ్రాండ్ వాల్యూ 328 కోట్లుగా ఉంది.

వ్యక్తుల బ్రాండ్ వాల్యూని ఫాలోవర్లు, రెగ్యులర్ ఎంగేజ్ మెంట్స్, ట్రెండ్స్ ఆధారంగా నిర్దారిస్తారు. తర్వాత అందులోని వాల్యూ నుంచి వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లు, ఇతర నెగెటివ్ అంశాలను మైనస్ చేస్తారు. నరేంద్రమోడీపై 25 శాతం వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఆయన బ్రాండ్ వాల్యూనే అత్యధికంగా ఉండటం విశేషం.

- మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

- ఆరోగ్యానికి అరటి.. ఎన్ని పోషకాలో..

Next Story
Share it