Top
Batukamma

మోడీ ఏం మాట్లాడబోతున్నారు..?

మోడీ ఏం మాట్లాడబోతున్నారు..?
X
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు .

Pm modi to address the nation at 6pm :ప్ర ధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు . సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ పౌరులకు సందేశం ఇవ్వబోతున్నట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ పై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. ఇవి ఓ కొలిక్కి రావడంతో ప్రధాని ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే.. పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించే అవకాశం కనిపిస్తోంది. ఫిజికల్ డిస్టెన్స్, ఇతర జాగ్రత్తలు ఎలా పాటించాలి..? గుమి గూడకుండా ఎలా పండుగలు చేసుకోవాలని ప్రధాని చెప్పే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it