Top
Batukamma

పుల్వామా ఘటన వాస్తవాలు బట్టబయలయ్యాయి : మోడీ

పుల్వామా ఘటన వాస్తవాలు బట్టబయలయ్యాయి : మోడీ
X
Highlights

వాళ్లు చేసిన ఘోరమైన కామెంట్స్ ను దేశ ప్రజలు మరిచిపోరన్నారు ప్రధాని. స్వార్థం, రాజకీయాలు పీక్స్ కు చేరాయన్నారు.

PM Slams Opposition Over Pulwama : ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవడియాలోని స్టాట్యూ ఆఫ్ యునిటీ దగ్గర ఏక్తా దివస్ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అపోజిషన్ పార్టీలపై ఫైరయ్యారు. పాకిస్థాన్ పైనా ఎటాక్ చేశారు. పుల్వామా దాడి గురించి ఇటీవల పాక్ మంత్రి ఒకరు వారి పార్లమెంట్ లో ప్రస్తావించారు. దీనిపై ప్రధాని స్పందించారు.

"ఈ పరేడ్ చూస్తోంటే.. పుల్వామా ఘటన నా మదిలో మెదులుతోంది. దేశం తన కుమారులనుకోల్పోయి.. విషాదంతో ఉంటే.. కొందరు మాత్రం.. అవేవీ పట్టించుకోలేదు. పుల్వామా దాడిలో కూడా వాళ్లు స్వార్థ ప్రయోజనాల వెతుక్కున్నారంటూ.." ప్రధాని ఫైరయ్యారు.

వాళ్లు చేసిన ఘోరమైన కామెంట్స్ ను దేశ ప్రజలు మరిచిపోరన్నారు ప్రధాని. ఘటన జరిగినప్పుడు స్వార్థం, రాజకీయాలు పీక్స్ కు చేరాయన్నారు.

బాలాకోట్ పై భారత వైమానికి దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన అపోజిషన్ కు ప్రధాని కౌంటర్ ఇచ్చారు.

"కొద్ది రోజుల క్రితం పొరుగుదేశం పార్లమెంట్ లో ది గురించి మాట్లాడారు. దాడే జరగలేదన్న వారికి అదే సమాధానం..." అన్నారు.

దేశ భధ్రత విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు ప్రధానమంత్రి. ప్రతీ ఒక్కరు దేశ ప్రయోజనాల పరిరక్షణే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని(PM Slams Opposition Over Pulwama ).

నిన్న కూడా కేవడియాలో పర్యటించారు ప్రధానమంత్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపారు. ఆరోగ్యవనం, న్యూట్రీ పార్క్, సర్దార్ పటేల్ జూ పార్క్ ను ప్రారంభించారు. సర్వ్ శ్రేష్ట్ భవన్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీకి క్రూయిజ్ షిప్ సర్వీసును ప్రారంభించారు.

- హీరోయిన్ పై మంత్రి గారి కన్ను.. పదవిపోయే దాకా వచ్చింది..!

- ఆర్జీవీ చేతిలో రూపుదిద్దుకున్న మరో హాట్ బ్యూటీ

Next Story
Share it