Top
Batukamma

ఛీ.. ఈ బట్టలేంటీ..? తిట్టేద్దాం.. కానీ...!

ఛీ.. ఈ బట్టలేంటీ..? తిట్టేద్దాం..  కానీ...!
X
Highlights

ఇప్పుడంతా ఫాస్ట్ ఫార్వార్డ్ ప్రపంచం. అన్ని అలవాట్లు మారిపోతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉంటున్నారు.

మన సంస్కృతి ఏంటీ..? మన సాంప్రదాయాలు ఏంటీ..? ఈ పిచ్చి ఫొటోలేంటీ..? వీళ్లు పక్కా ఆ మతపోళ్లే. అందుకే ఇలా బరితెగించి పాశ్చాత్య సంస్కృతి తెచ్చి పెట్టుకుని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.... ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే తిట్ల పురాణం నడుస్తోంది.

దీనికంతటికీ కారణమైంది.. ఈ ఫొటో షూట్. ఓ జంట తమ ఫొటో షూట్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుని ఇలా తీయించుకుంది. రిషి కార్తికేయన్, లక్ష్మి అనే ఇద్దరు ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు.



అయితే.. కరోనా ఆంక్షల కారణంగా పెళ్లి గ్రాండ్ గా చేసుకోలేకపోయారు. కానీ ఫొటో షూట్ అయినా కాస్త డిఫరెంట్ గా చేసుకోవాలని ప్లాన్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఫొటో గ్రాఫర్ అయిన తమ మిత్రుడికి చెప్పాడు.

ఫొటో సూట్ సినిమాటిక్ గా ఉండాలనుకున్నారు. కాస్త రొమాంటిక్ గా ఉండాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఫొటో షూట్ కంప్లీట్ చేసుకుని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక అప్పుడు మొదలయ్యింది అసలు కథ. సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, కులం, మతం.. దేన్నీ వదలకుండా రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు మీరు లోపల బట్టలేసుకున్నారా.. అంటూ దిగజారి ప్రశ్నలడుగుతున్నారు.


అయితే.. ఈ జంట మాత్రం తాము చేసినదాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తోంది. మా ఫొటోలు మా ఇష్టం.. కౌంటర్ ఇచ్చింది. స్లీవ్ లెస్ డ్రెస్ లు, మొకాళ్ల వరకు దుస్తులు వేసుకునే వారిలో ఒకదాన్ని అని.. ఇందులో న్యూడిటీ ఏంటీ అని ప్రశ్నించింది.

నిజంగానే ఫొటోలు రొమాంటిక్ గా ఉన్నాయి. అయితే.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఉంటే.. ఆహా ఓహో అంటాం. అదే నిజజీవితం లోకి వచ్చే సరికి ఇలా ట్రోల్ చేసి వాళ్ల తోలు తీసి డోలు కడతాం.



ఇప్పుడంతా ఫాస్ట్ ఫార్వార్డ్ ప్రపంచం. అన్ని అలవాట్లు మారిపోతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉంటున్నారు. ఇలాంటి సమాజంలో ఒకరి అభిప్రాయాలను ఏకీభవించడం.. ఏకీభవించకపోవడం.. రెండూ ఉంటాయి. కానీ ఇలా ట్రోల్ చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది.

Next Story
Share it