Top
Batukamma

ఈ రాజకీయాలు మనకొద్దు.. రజినీకాంత్ మనసు మారుతోందా..?

ఈ రాజకీయాలు మనకొద్దు.. రజినీకాంత్ మనసు మారుతోందా..?
X
Highlights

ఎట్టకేలకు 2020 ముగింపులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు రజినీకాంత్.

Rajinikanth political entry problems: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth).. పాలిటిక్స్ లోకి వస్తున్నానని, వచ్చేస్తున్నానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా.. అనేలోపే ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఎట్టకేలకు 2020 ముగింపులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు రజినీకాంత్.

డిసెంబర్ 31న పార్టీ స్థాపన ప్రకటన చేయనున్నట్టు ఇటీవలే తెలిపారు. అదే రోజున పార్టీ పేరు, గుర్తు, జెండా.. అన్నీ ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఈ వేడుక ప్రిపరేషన్స్ లో ఆయన ముఖ్య అనుచరులు బిజీగా ఉన్నారు. పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

కానీ ఇదే టైంలో రజినీకాంత్ కు వరుస అపశకునాలు, అడ్డంకులు తలనొప్పిగా మారాయి. పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు రజినీకాంత్. అయితే.. సెట్ లో ఆరుగురికి కరోనా రావడంతో షూటింగ్ నిలిచిపోయింది.

రజినీకాంత్ సేఫ్ గానే ఉన్నారనుకునేలోపు బీపీ సమస్య ఆయనను హాస్పిటల్ పాలు చేసింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు తలైవాకు ఏమౌతుందోనని టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకు ఆయన సేఫ్ గా డిశ్చార్జ్ కావడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.


అయితే.. ఇప్పుడు రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి మరో సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా ఫ్యామిలీలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీకి అడ్డుతగులుతున్నారని సమాచారం. పాలిటిక్స్ లోకి వెళ్లొద్దని ఆయన కూతుర్లు కాస్త గట్టిగానే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్(Hyderabad) అపోలో(Apollo) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చెన్నై వెళ్లారు రజినీకాంత్. అక్కడ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య ఆయనతో దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలతోనే బీపీ సమస్య వస్తోందని.. పొలిటికల్ ఎంట్రీ ఆలోచన మానుకోవాలని కోరారట. మీరు ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాలని మరీ మరీ చెప్పారట.

రజినీకాంత్ మాత్రం కూతుళ్ల డిమాండ్ ను అంగీకరించలేదని తెలుస్తోంది. భాషా స్టైల్లో ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేనని.. పార్టీ పెట్టడం విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పినట్టు వినికిడి. ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 31న పార్టీ ప్రకటన కార్యక్రమం ఉంటుందని సమాచారం. అయితే.. అనారోగ్యం నేపథ్యంలో రజినీకాంత్ నేరుగా ఆ సభలో పాల్గొంటారా..? వర్చువల్ గా పాల్గొంటారా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

- నిజమైన ప్రేమ ఎంతపనిచేసిందంటే..!

- Bank Holidays : 2021 లో బ్యాంక్ హాలీడేస్ ఇవే

- కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..

Next Story
Share it