Top
Batukamma

ఓ భర్త.. ఇద్దరు భార్యలు.. పోలీసుల తీర్పు కెవ్వు కేక!

ఓ భర్త.. ఇద్దరు భార్యలు.. పోలీసుల తీర్పు కెవ్వు కేక!
X
Highlights

రాంచీకి చెందిన రాజేష్‌ మహోతో అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతనికి ఓ కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో రాజేష్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడింది.

అప్పుడప్పుడు సినిమాలను తలపించే సన్నివేశాలు బయటకూడా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడో సంఘటన చోటు చేసుకుంది. శోభన్‌ బాబు, వాణిశ్రీ, శారదల కాంబినేషన్‌లో వచ్చిన 'ఎవండోయ్‌.. ఆవిడొచ్చింది' సినిమా గుర్తుంది కదా.. ఇందులో హీరో శోభన్‌ బాబు మూడు రోజులు మొదటి భార్య దగ్గర, మరో మూడు రోజులు రెండో భార్య దగ్గర, మరొకరు రోజు అమ్మనాన్నల దగ్గర ఉంటాడు. సరిగ్గా ఇలాంటి కథే జార్ఖండ్ లో జరిగింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాంచీకి చెందిన రాజేష్‌ మహోతో అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతనికి ఓ కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో రాజేష్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆ యువతి దగ్గర పెళ్ళైనా విషయాన్ని దాచాడు రాజేష్.. ఈ నేపధ్యంలో యువతితో పెళ్లి కోసం ఇంటినుంచి పారిపోయాడు. అటు ఆ యువతి కూడా ఇంటినుంచి పారిపోయింది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వేరే ప్రాంతంలో కాపురం కూడా పెట్టాడు.

అయితే భర్త కనిపించడం లేదని రాజేష్‌ భార్య బట్వార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తమ కూతురు కనిపించడం లేదని, యువతి తల్లిదండ్రులు అదే పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులకు రాజేష్‌ ప్రియురాలితో సహా దొరికిపోయాడు. పోలిస్ స్టేషన్ లో రాజేష్ మొత్తం జరిగిన విషయాన్నీ చెప్పాడు . ఈ నేపథ్యంలో రాజేష్‌ భార్య, ప్రియురాలికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అతడు నా భర్త అంటే నా భర్త అంటూ ఇద్దరూ గొడవకు దిగారు.

అయితే ఇదంతా దగ్గరుండి చూస్తున్న పోలీసులు వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఓ సలహా ఇచ్చారు. వారంలో మూడు రోజులు రాజేష్ మొదటి భార్య దగ్గర ఉండాలని, మరో మూడు రోజులు రెండో భార్య(ప్రియురాలు) వద్ద ఉంటాడని, ఇక మిగిలిన ఒక్కరోజు అతడి ఇష్టమంటూ పోలీసులు ఓ ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు ఓ బాండ్ పేపర్ కూడా రాయించారు. ఆ తర్వాత రాజేష్‌ తన మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో ప్రియురాలు మళ్ళీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేసింది.

పెళ్లైందనే విషయాన్ని దాచి పెట్టి రాజేష్ తనని మోసం చేశాడని, లైంగికంగా హింసించాడని కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ఇంటికి వెళ్ళగా అప్పటికే రాజేష్ పరారయ్యాడు. అయితే రాజేష్‌ పారిపోవడానికి మొదటి భార్యే సహాకరించిందంటూ ప్రియురాలు కోర్టుకు వెళ్ళడం గమనార్హం!

Next Story
Share it