Top
Batukamma

Reliance zoo : త్వరలో రిలయన్స్ "జూ".. అడవి జంతువులు ఆయన చేతుల్లోకే..!

Reliance zoo : త్వరలో రిలయన్స్ జూ.. అడవి జంతువులు ఆయన చేతుల్లోకే..!
X
Highlights

ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్ట్ లో టాప్ కి చేరారు ముఖేష్ అంబానీ.

Reliance to build worlds largest zoo in Gujarat : ఉప్పు నుంచి.. చెప్పు వరకు అన్నీ వ్యాపారాల్లో దూసుకెళ్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries Ltd). క్రూడాయిల్ నుంచి వంటనూనె వరకు.. ఇలా ప్రతీ రంగంలోనూ రిలయన్స్(Reliance) దే హవా. ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్ట్ లో టాప్ కి చేరారు ముఖేష్ అంబానీ.

వందల రకాల వ్యాపారాలు చేస్తున్న ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే జంతు ప్రదర్శన శాల(zoo).. లేదా జువాలజికల్ పార్క్.

అదేదో చిన్నా చితక పార్క్ కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద జువాలజికల్ పార్క్(world's largest zoo) నిర్మించే పనుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజీగా ఉంది. గుజరాత్ లోని జామ్ నగర్ లో(Gujarat's Jamnagar) దీనిని నిర్మిస్తున్నారు.

దాదాపు 280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జువాలజికల్ పార్క్ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ పక్కనే ఈ జూ పార్క్ ఏర్పాటు కాబోతోంది.


ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఈ ప్రాజెక్ట్ పనులు చూస్తున్నారు. ఈ జూ పార్క్ లో 100 రకాల జంతువులు(100 different species), పక్షులు, సరీసృపాలు ఉండున్నాయి. దేశంతో పాటు.. విదేశాల జంతు జాతులను కూడా ఇందులో ఉంచనున్నారు.

ఈ జూ లో ఫారెస్ట్ ఆఫ్ ఇండియా(Forest of India), ఫ్రాగ్ హౌస్(Frog House), ఇన్సెక్ట్ లైఫ్(Insect Life), డ్రాగన్స్ ల్యాండ్(Dragon's Land), ఎక్సోటిక్ ఐలాండ్(Exotic Island), వైల్డ్ ట్రయల్ ఆఫ్ గుజరాత్(Wild Trail of Gujarat) లాంటే విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.

దీనికి గ్రీన్స్ జువాలాజికల్ పార్క్ అండ్ రిహాబిలిటేషన్ కింగ్ డమ్(Greens Zoological, Rescue & Rehabilitation Kingdom) అని పేరు పెట్టనున్నట్టు రిలయన్స్ వర్గాలు తెలిపాయి.

ఈ జూ పార్క్ నిర్మాణ పనులు గతంలోనే ప్రారంభం అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని రకాల అనుమతులు కూడా వచ్చేశాయి. కానీ కరోనా వల్ల పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆలస్యం లేకుండా పనులు పూర్తిచేస్తామని రిలయన్స్ చెబుతోంది. రెండేళ్లలో జూ పార్క్ ఓపెన్ చేస్తామంటోంది.

- అయోధ్యలో కట్టబోయే మసీదు ఇలాగే ఉంటుంది

- Daily Horoscope telugu: 20-12-2020 ఆదివారం నేటి రాశిఫలాలు

- అపుకోలేకపోతున్నాం బాబోయ్ .. మొత్తం వదలండి!

- దిల్ రాజు లక్కీ.. అందంతో మతి పోగోడుతున్న వైఘారెడ్డి!

Next Story
Share it