Top
Batukamma

మాస్క్ మస్ట్.. లేకపోతే 2,000 కట్టు!

మాస్క్ మస్ట్.. లేకపోతే 2,000 కట్టు!
X
Highlights

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, పండగలను కూడా ఇంటివద్దే చేసుకోవాలని అన్నారు. వచ్చే ఛట్ పూజను ఇంటి వద్దే చేసుకోవాలని సూచించారు.

మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో అయితే దారుణంగా ఉంది పరిస్థితి. రోజుకు కొన్ని వేల కేసులువస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 7,400 కుపైగా కేసులు రాగా 131 మరణాలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. తాజా పరిస్థితుల పైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేజ్రివాల్ మీడియాతో మాట్లాడారు.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, పండగలను కూడా ఇంటివద్దే చేసుకోవాలని అన్నారు. వచ్చే ఛట్ పూజను ఇంటి వద్దే చేసుకోవాలని సూచించారు.

ఇక మాస్క్ ధరించడం కంపల్సరీ అన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోయిన రూ.2,000 జరిమానా విధిస్తామని కేజ్రివాల్ సూచించారు. ఇంకా ముందుముందు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

అక్టోబర్ చివరి నుండి ఢిల్లీలో కేసులు పెరుతుండగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

Next Story
Share it