Top
Batukamma

అక్కాచెల్లెళ్ళ పెళ్లి.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్!

అక్కాచెల్లెళ్ళ పెళ్లి.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్!
X
Highlights

ఇక తమని లెస్బియన్ జంట అని పిలిస్తే కూడా తమకు ఎలాంటి అవమానం లేదని కూడా వారు చెప్పుకొచ్చారు. స్వలింగసంపర్క సంబంధం ఇప్పుడు చట్టబద్ధంగా ఉందని ఇది తమకు బాగా తెలుసునని ఈ జంట చెప్పడం మరో విశేషం..

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం అనేది సహజంగా కామన్.. కానీ ఇప్పుడు అమ్మాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కూడా కామన్ అయిపొయింది. వరుసగా ఇలాంటి ఘటనలు ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇదే తరహ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఐదేళ్ళుగా జార్ఖండ్‌, కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు(కజిన్స్ ) ప్రేమించుకుంటున్నారు. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరు కాబట్టి ఇద్దరూ ఇంటినుంచి పారిపోయారు.

గత నెల (నవంబర్‌) 8వ తేదీన గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారుంటున్న ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రచౌక్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. అయితే వీరిద్దరూ చంద్రచౌక్‌లో ఉన్నట్టుగా ఇరు కుటుంబ సభ్యులకి తెలియడంతో అక్కడికి చేరుకుని గొడవ చేశారు.

ఇది కాస్తా పోలిసులు ఎంటర్ అయ్యేదాకా వెళ్ళింది. అయితే ఇద్దరమ్మాయిలు మేజర్లు కావడంతో పోలీసులు కూడా అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళిపోయారు.

ఇక దీనిపైన ఈ ఇద్దరమ్మాయిలు మాట్లాడుతూ.. " మా కుటుంబాలు తమల్ని బెదిరిస్తున్నాయని కానీ మేం దాన్ని లెక్క చేయనని అన్నారు. ఐదేళ్లుగా తాము ప్రేమించుకొని, గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యామని చెబుతున్నారు. త్వరలో మా పెళ్లిని కోర్టు ద్వారా చట్టబద్దం‌ చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.

ఇక తమని లెస్బియన్ జంట అని పిలిస్తే కూడా తమకు ఎలాంటి అవమానం లేదని కూడా వారు చెప్పుకొచ్చారు. స్వలింగసంపర్క సంబంధం ఇప్పుడు చట్టబద్ధంగా ఉందని ఇది తమకు బాగా తెలుసునని ఈ జంట చెప్పడం మరో విశేషం.. న్యూయార్క్‌లో నివసిస్తున్న అంజలి చక్రవర్తి, సూఫీ చెప్పుల ప్రభావం తమ ప్రభావం ఉందని ఈ జంట తెలిపింది.

Next Story
Share it