రైతుల ప్రాణాలు కాపాడితే హత్యాయత్నం కేసు పెట్టారు..!

రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలను రద్దుచేయాలనే డిమాండ్ తో హర్యానా, పంజాబ్ కు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ వైపు కదులుతున్నారు.
ఢిల్లీ వైపు వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. హర్యానా సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు రైతులను అడ్డుకుంటున్నారు. రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయినా వెనక్కి తగ్గకుండా రైతులు ఢిల్లీ వైపు దూసుకెళ్తున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం వారిని ఢిల్లీలోకి అనుమతించింది. ఢిల్లీ శివారులోని నిరంకారి గ్రౌండ్ వరకు రావొచ్చని చెప్పింది.
The determination and resilience of the farmers is admirable. In a free and just society one should be able to advocate for their cause without the threat of force being used against them. The brutality being faced by Indian farmers in these images is deplorable.
— Ruby Sahota (@rubysahotalib) November 27, 2020
#FarmersProtest pic.twitter.com/femktmTp0z
రైతులు మాత్రం ఢిల్లీలో పలు ప్రదేశాల్లో ధర్నాకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కదిలేది లేదని హర్యానా సరిహద్దులోనే బైటాయించారు.
అయితే.. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం జరిగిన ఓ సంఘటన పాలకుల కృరత్వాన్ని బయటపెట్టింది. ఢిల్లీ వైపు వస్తున్న వారిపై పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన 26 ఏళ్ల యువ రైతు నవ్ దీప్ సింగ్.. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
How a young farmer from Ambala Navdeep Singh braved police lathis to climb and turn off the water cannon tap and jump back on to a tractor trolley #farmersprotest pic.twitter.com/Kzr1WJggQI
— Ranjan Mistry (@mistryofficial) November 27, 2020
పోలీసులు కొడుతున్నా.. వారి వాహనంపైకి ఎక్కి వాటర్ కెనన్ ను ఆపేశాడు. అక్కడి నుంచి ట్రాక్టర్ లో దూకేశాడు.
అయితే.. పోలీసు వాహనంపైకి ఎక్కి వాటర్ కెనన్ ఆపేసినందుకు అతనిపై అటెంప్ట్ టూ మర్డర్(హత్యాయత్నం) కేసు పెట్టారు పోలీసులు. అలాగే.. అల్లర్లను ప్రేరేపించారని, కరోని నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు పెట్టారు. అటెంప్ట్ టూ మర్డర్ కేసులో అతనికి గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది.
వాటర్ కెనన్ లతో తోటి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేకే తాను దాన్ని ఆపేశానని చెబుతున్నాడు నవ్ దీప్ సింగ్. తాను ఎప్పుడూ ఎలాంటి అల్లర్లలో పాల్గొనలేదని.. తనపై హత్యాయత్నం కేసు పెట్టడం బాధాకరమన్నారు.
- హాట్ షో చేస్తున్న ఐస్ క్రిీం తేజస్వి