Top
Batukamma

10 రూపాయలకే బిర్యానీ.. యజమానిని బొక్కలో తోసిన పోలీసులు!

10 రూపాయలకే బిర్యానీ.. యజమానిని బొక్కలో తోసిన పోలీసులు!
X
Highlights

ఎప్పుడు తిన్నారో ఏమో కానీ బిర్యానీ కోసం బారులు తీరారు.. ఫలితంగా అక్కడ పెద్ద తోపులాట మొదలైంది..ఆ తోపులాటకు ఏకంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్‌ అనే వ్యక్తి ఆదివారం రోజున ఓ హోటల్ పెట్టాడు.. అయితే కస్టమర్లును అట్రాక్ట్ చేసేందుకు ఫస్ట్ డే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ కేవలం రూ.10లకే బిర్యానీ అనే బంపర్ ఆఫర్ పెట్టాడు.. ఆఫర్ చూసి చాలా మంది టెంప్ట్ అయ్యారు. ఎంతలా అంటే కరోనాను కూడా లెక్కచేయలేదు..

ఎప్పుడు తిన్నారో ఏమో కానీ బిర్యానీ కోసం బారులు తీరారు.. ఫలితంగా అక్కడ పెద్ద తోపులాట మొదలైంది..ఆ తోపులాటకు ఏకంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో పోలిసుల వరకు మ్యాటర్ వెళ్ళడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భౌతిక దూరం లేకపోవడం, గుంపులుగా నిలబడటం, ఉన్నవారిలో చాలా మందిలో మాస్కులు ధరించకపోవడం చూసిన పోలీసులు హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు.

అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపు తయారు చేసిన 2500 బిర్యానీ పొట్లాల్లో సగం అమ్మేశారు.. ఇక మిగిలిన బిర్యానీ పొట్లాలను పంచిపెట్టారు.. ఇక రూల్స్ అతిక్రమించినందుకు గాను హోటల్‌ యజమానిపై 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదని హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story
Share it