Top
Batukamma

స్కూళ్ల ఓపెనింగ్ పై కేంద్రం దోబూచులాట..!

unlock 5.0
X
Highlights

లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. అన్నింటికి అనుమతి ఇచ్చి స్కూళ్ల విషయం రాష్ట్రాల మీద నెట్టేస్తోంది.

UNLOCK 5.0 : దేశంలో లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కంటైన్ మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో కాస్త రిలాక్సేషన్స్ ఇచ్చింది.

అయితే అన్ లాక్ 5 నిబంధనలు మరో నెల రోజుల పాటు కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 30 న అన్ లాక్ నిబంధనలు ప్రకటించింది. పండగల నేపథ్యంలో వీటిని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.

అంతర్రాష్ట్ర ప్రయాణాల, సరుకు రవాణా వాహనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పింది. వాణిజ్య సంస్థలు తెరిచే విషయంలో గత ఆదేశాలనే కొనసాగించింది. కంటైన్ మెంట్ జోన్ల బయట కమర్షియల్ కాంప్లెక్స్ లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

50 శాతం మందితో సినిమా థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఇక స్కూళ్ల విషయంలో అధికారం మరోసారి రాష్ట్రాలకే అప్పజెప్పింది. స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలనే దానిపై రాష్ట్రాలదే అధికారమని చెప్పింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి లో లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 1 నుంచి దశల వారీగా లాక్ డౌన్ (UNLOCK 5.0) ఆంక్షలు సడలిస్తూ వస్తోంది.

అయితే.. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న కేంద్రం.. విద్యాసంస్థల విషయంలో మాత్రం దోబూచులాడుతోంది. స్కూళ్లు ఎప్పుడు తెరవాలనేదానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది.

ఓ వైపు జాగ్రత్తగా ఉండాలంటూనే మరోవైపు విద్యాసంస్థలపై ఎటూ తేల్చకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్రం ఓ క్లియర్ కట్ నిర్ణయం చెబితే రాష్ట్రాలు ఫాలో అవుతాయి కదా అని విద్యార్థుల పేరంట్స్ అంటున్నారు. అన్నింటికి సరైన ఆదేశాలిస్తున్న కేంద్రం.. విద్యాసంస్థల విషయంలో ఎందుకిలా చేస్తోందని ప్రశ్నిస్తున్నారు.

- ఆ.... ఇంకెవరైనా మిగిలారా..? బీజేపీకి ఓట్ల వరదేనా ఇక..?

- షాకింగ్ వీడియో : నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

Next Story
Share it