Top
Batukamma

25 ఏళ్ల సింగర్ పై.. 63 ఏళ్ల ఎమ్మెల్యే అత్యాచారం!

25 ఏళ్ల సింగర్ పై.. 63 ఏళ్ల ఎమ్మెల్యే అత్యాచారం!
X
Highlights

25 ఏళ్ల సింగర్ పైన అత్యాచారం చేసినందుకు గాను బీజేపీ మిత్రపక్షమైన నిషద్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా పైన కేసు నమోదు అయింది. విజయ్ మిశ్రాతో పాటుగా అతని కుమారుడుతో సహా ముగ్గురు వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకి ఏమైందంటే .. 2014 లో విజయ్ మిశ్రా తనను తన ఇంటికి ఒక కార్యక్రమం కోసం పిలిచారని, అక్కడికి వచ్చాక విజయ్ మిశ్రా, అతడు కొడుకు, తనపై అత్యాచారం చేశారని, ఈ సంఘటన గురించి ఎప్పుడైనా మాట్లాడితే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా 2015 లో వారణాసిలోని ఒక హోటల్‌లో కూడా తన పైన అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక అత్యాచారం తర్వాత మిశ్రా తన కొడుకు, మేనల్లుడిని తనని ఇంటివద్ద వదిలివేయమని చెప్పాగా, తిరిగి ఆ ఇద్దరూ మళ్ళీ అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది. ఈ విషయాలను భడోహి పోలీస్ సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ మీడియాకి వెల్లడించారు.

"విజయ్ మిశ్రా వద్ద నా వీడియో క్లిప్ కూడా ఉంది. అంతేకాక అతనిపైన వివిధ కేసులు ఉన్నప్పటికీ అతను ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయటానికి నేను భయపడ్డాను" అని బాధితురాలు తెలిపింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే విజయ్ మిశ్రా మధ్యప్రదేశ్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్టు చేసి ఆగ్రా జైలులో ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో సదరు సింగర్‌ అతని మీద గోపిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిశ్రాను గత మూడు వారాల క్రితం చిత్రకూట్ జైలు నుండి ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story
Share it