Top
Batukamma

Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?

Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?
X
Highlights

రెగ్యులర్ గా లీటర్ పాలు తెచ్చే షబ్నమ్.. ఆరోజు రెండు లీటర్ల పాలు తీసుకొచ్చింది.

Shabnam ali : బాగా చదువుకుంది. టీచర్ గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. కానీ చివరకు ఆమె బుద్ధే దారి తప్పింది. ప్రేమించిన వాడి కోసం కన్నవారిని కడతేర్చింది. చివరకు దేశంలోనే ఉరిశిక్ష పడబోతున్న తొలి మహిళగా చరిత్రలో తన రక్తచరిత్రను రాయబోతోంది.

షబ్నమ్‌ అలీ(Shabnam ali).. ఉత్తరప్రదేశ్‌లోని బావాంఖేరిలో జన్మించింది. సైఫీ ముస్లిం వర్గానికి చెందిన ఆమె.. ఇంగ్లీష్, జియాలజీలో పీజీ చేసింది. కొద్ది రోజుల పాటు స్కూల్ టీచర్ గా కూడా పనిచేసింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన టీచర్ గా పేరు తెచ్చుకుంది.

కానీ ప్రేమ పేరుతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆరో తరగతి కూడా పూర్తి చేయని, తనకంటే చిన్నవాడైన సలీం(saleem)అనే ఓ యువకుడిని ప్రేమించింది. అతను చేసేది కూలీపని కావడంతో.. షబ్నం తల్లిదండ్రులు వారి ప్రేమని అంగీకరించలేదు.

తల్లిదండ్రుల నిర్ణయం షబ్నమ్ ను తీవ్రంగా కలచివేసింది. మనసిచ్చిన వాడిని.. ఇంటివారే కాదనే సరికి కొన్ని రోజులు తిండి కూడా మానేసింది. ఆమె సోదరులకు కూడా ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఆమెను కొట్టారు కూడా.

దీంతో తన ప్రేమని వ్యతిరేకించిన కుటుంబసభ్యులపై ఆమె కోపం పెంచుకుంది. ప్రేమించిన వాడి కోసం వారిని హత్య చేయాలని భావించింది. ముందుగానే ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన ఆమె.. 2008 ఏప్రిల్ 15న వారిని అంతమొందించింది.రెగ్యులర్ గా లీటర్ పాలు తెచ్చే షబ్నమ్.. ఆరోజు రెండు లీటర్ల పాలు తీసుకొచ్చింది. అందులో మత్తుమందు కలిపి ఇంట్లోని ఏడుగురికి ఇచ్చింది. మత్తులో ఉన్న కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపింది.

వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ఈకేసులో ఇరికించి.. ఆస్తి తీసుకుని ప్రియుడితో కలిసి ఉండాలని అనుకుంది. కానీ పోలీసుల ఎంక్వైరీలో అసలు దోషి షబ్నమేనని తేలిపోయింది. ఈ కేసులో షబ్నమ్, సలీమ్ ను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు 2010 లోనే మరణశిక్ష విధించింది. ఈ 11 సంవత్సరాల్లో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. షబ్నమ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. ఈ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు షబ్నమ్‌ ఏడు నెలల గర్భవతి. 2008లో జైలులో ఉండగానే బాబుకి జన్మనిచ్చింది. 2015లో అతని సంరక్షణను వేరేవారికి అప్పగించారు. ఇప్పుడు ఆ 12ఏళ్ల బాబే తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(president ramnath kovind) ఎదుట క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు.

షబ్నమ్ ఉరిశిక్షకు తేదీ ఖరారు కానప్పటికీ.. ఉరితీసేందుకు మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ హత్యలు చేసినప్పుడు షబ్నమ్ వయసు 27 ఏళ్లు. ఇప్పుడు 39 ఏళ్లు.

- అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !

- ఆమె గాత్రం ఎంతో మధురమో.. ఆమె రూపం అంత అద్భుతం.. !

- సునీత బాటలోనే సురేఖవాణి... రెండో పెళ్లికి రెడీ.. !

- ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?

- జగన్‌‌‌కు షాక్ .. పార్టీ కంటే ముందే షర్మిల కొత్త టీవీ ఛానల్..!

Next Story
Share it