Top
Batukamma

వాట్సాప్‌లో చూసినట్లు లేడు.. తాళి కట్టేముందు పెళ్లికొడుక్కి షాకిచ్చిన వధువు..!

వాట్సాప్‌లో చూసినట్లు లేడు.. తాళి కట్టేముందు పెళ్లికొడుక్కి షాకిచ్చిన వధువు..!
X
Highlights

ఈ మధ్య అఖిరి నిమిషంలో పెళ్ళిళ్ళు ఆగిపోవడం అనేది ఓ ట్రెండ్ గా మారిపోయింది. అయితే అబ్బాయి పారిపోవడం లేదా అమ్మాయి ఈ పెళ్లి ఇష్టం లేదని చివర్లో షాక్ ఇవ్వడం జరుగుతున్నాయి.

ఈ మధ్య అఖిరి నిమిషంలో పెళ్ళిళ్ళు ఆగిపోవడం అనేది ఓ ట్రెండ్ గా మారిపోయింది. అయితే అబ్బాయి పారిపోవడం లేదా అమ్మాయి ఈ పెళ్లి ఇష్టం లేదని చివర్లో షాక్ ఇవ్వడం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బీహార్‌లోని చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. చంపారన్ జిల్లా బాగీ ముషారీకి చెందిన అనిల్ కుమార్ చౌదరి అనే యువకుడికి శాంఖియమైకి చెందిన ఓ యువతితో పెళ్లి చేయాలనీ అనుకున్నారు. అందులో భాగంగానే ఆ యువకుడి ఫోటోను వాట్సాప్‌లో అమ్మాయికి పంపించగా... అమ్మాయి కూడా నచ్చాడని ఒకే చెప్పింది. దీనితో పెళ్లి ఫిక్స్ అయింది.

స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బ్రంహ్మాడంగా చేశారు. ఇక చివరి నిమిషంలో వధువు మెడలో తాళి కట్టే సమయానికి వధువు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇదేంటని అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులను అడగగా.. అబ్బాయి వాట్సాప్‌లో చూసినట్లు లేడని, తనకి నచ్చలేదని... ఈ పెళ్లి ఇష్టం లేదని వెల్లడించింది.

అమ్మాయి అభిప్రాయానికి ఆమె తల్లిదండ్రులు ఓకే చెప్పగా, వరుడు అక్కడినుంచి నిరాశ చెంది వైదొలిగాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Next Story
Share it