Top
Batukamma

Durga Rao : TV5 ఇదేనా మీ సంస్కారం.. కనీసం కుర్చీలు కూడా లేవా?

Durga Rao : TV5 ఇదేనా మీ సంస్కారం.. కనీసం కుర్చీలు కూడా లేవా?
X
Highlights

Durga Rao : టాలెంట్ ఎవరి సొంతం కాదు.. వెతికాలి కానీ ప్రతి మనిషిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటకు...

Durga Rao : టాలెంట్ ఎవరి సొంతం కాదు.. వెతికాలి కానీ ప్రతి మనిషిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటకు తీసినప్పుడే మనం ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. అలా టిక్ టాక్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చాడు దుర్గారావు (Durga Rao )..

సినిమా పాటలకి, డైలాగ్ లకు తన భార్యతో చేసిన వీడియోలు నెటిజన్లను అలరించాయి.. అతన్ని మరొకరు ఇమిటేట్ చేసే స్థాయికి వెళ్ళాడు.. ఏకంగా తన డాన్స్ కి ఫిదా అయిపోయి "దుర్గారావు నాట్యమండలి" అనే సంఘం ఏర్పడింది అంటే అర్ధం చేసుకోవచ్చు మనోడి పాపులారిటీ ఎక్కడిదాకా వెళ్లిందో..

ప్రస్తుతం టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ యూట్యూబ్ లో అతని వీడియోలు పాపులర్ అవుతున్నాయి. ఆ వీడియోలలో అతను కూడా బాగా పాపులర్ అవుతున్నాడు. ఈ మధ్య అదిరింది, జబర్దస్త్ షోలలో కూడా కనిపించి అదరగొట్టాడు దుర్గారావు..

దుర్గారావు పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకున్న మీడియా కూడా అతన్ని ఇంటర్వ్యూలు చేస్తోంది. పనిలో పనిగా TV5 దుర్గారావు మరియు అతని భార్యను ఇంటర్వ్యూ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. షోకి వచ్చిన వారికి మర్యాద లేకుండా కుర్చీలు వేయకుండా ఇంటర్వ్యూ చేయడం నెటిజన్లకు నచ్చలేదు.. దాదాపుగా ఓ ముప్పై నిముషాలు అలాగే నిలబెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఇది నచ్చని నెటిజన్లు సదరు ఛానల్ పై తమ కామెంట్స్ తో దుమ్ముదులిపారు.

"మీకు పల్లెటూరు వాళ్లంటే. అంత అలుసా పల్లెటూరు నుండి వచ్చారని, వాళ్లకి కుర్చీ కూడావేయకుండా అంత సేపు నిలబెట్టి. ఇంటర్యు చేస్తారా. మీ టీవీ వాళ్లకు బుద్ధి జ్ఞానం అసలు ఏమైనా ఉందా" అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. "యాంకర్ కు ఏమైనా పైల్స్ ప్రాబ్లెమ్ ఉంటే నిల్చోబెట్టండి.. అంతే గానీ అంత సేపు వారిని నిలబెట్టి అలాగే ఇంటర్వ్యూ చేయడం భావ్యమా" అని మరొకరు ప్రశ్నించారు.

"మీ బోడి టీవీ ఫైవ్ ఛానల్ కి గతి లేదా కనీసం కుర్చీలు కూడా లేవా కూర్చోడానికి పాపం" అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా "32 నిముషాలు నిలబడి ఉండడం ఏమిటి 2 చైర్స్ వేయచ్చు గా బాగుంటుంది చూడటానికి" అంటూ మరొకరు సలహా ఇచ్చారు.

ఇక మరొకరు "హలో ముందు వాళ్ళని కుర్చీబెట్టండి ,ఎవడో పనికిరాని సెలబ్రిటీలనెమో మంచి సోపాలో బెడ్లు ఎసి కూర్చోబెడతారు ఈ సామాన్య ప్రజాలనేమో ఇలా నిలబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా ఇదెక్కడి న్యాయం.... ఓహో వాళ్ళు కూర్చుంటే మసిపోతుందేమో ,ఫస్ట్ ఎవడయా నిన్ను ఇంటర్వ్యూ చేయమన్నది" అంటూ ఫైర్ అయ్యారు.

"కనీసం కూర్చొని ఇంటర్వ్యూ చేసే మర్యాద కూడా తెలియదా ఈ ఛానెల్ కి" అంటూ మరొకరు ఫైర్ అయ్యారు. "వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే బాగుండేది.పిలిచి అవమానించడం ఎందుకు" అంటూ మరొకరు ప్రశ్నించారు.

మాములుగా సినీ, రాజీకీయ ప్రముఖులను తీసుకువచ్చి మీడియా గంటలు గంటలు ఇంటర్వ్యూ చేస్తోంది.. వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు.. ఇక జోత్యిష్య పండితులను, డిబేట్ కోసం ముక్కు మొఖం తెలియని వారిని తీసుకువచ్చి కాపీలు టీలు ఇస్తూ గంటలు గంటలు సొల్లు పెట్టుకుంటూ వారికి ఎక్కడ లేని పబ్లిసిటీ ఇస్తుంది మీడియా..

తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన దుర్గారావుని ఇలా ఇంటర్వ్యూకి పిలిచి నిలబెట్టి 30 నిముషాలకి పైగా ఇంటర్వ్యూ చేయడం అనేది సంస్కారం అనిపించకోదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తప్పులను ఎకిపారేసేది మీడియా కావచ్చు..అదే తప్పు మీడియా చేస్తే మీడియాను ఎకిపారేసేందుకు ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు.

Durga Rao, Durga Rao tik tok, tik tok durga rao

https://www.youtube.com/watch?v=DOjHMQZKCm8

Next Story
Share it