Top
Batukamma

కొంపముంచిన ఎల్లమ్మ బోనాలు.. 70 మందిలో 40 మందికి కరోనా...!

కొంపముంచిన ఎల్లమ్మ బోనాలు.. 70 మందిలో 40 మందికి కరోనా...!
X
Highlights

ఇదిలావుండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. అక్కడ 70మందికి కరోనా టెస్టులు చేయగా 40మందికి కరోనా వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ మామాలుగా లేదు.. భీభత్సంగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న అయితే దేశవ్యాప్తంగా ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కొన్ని రాష్ట్రాలు అయితే లాక్ డౌన్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. అయితే కరోనా కేసులు ఎక్కువగా పెరగడానికి జనాల నిర్లక్ష్యమేనని నిపుణులు అంటున్నారు.

కరోనా వ్యాక్సిన్ వచ్చాక.. కరోనా లేదు ఏం లేదంటూ.. వచ్చిన వ్యాక్సిన్ ఉందిలే అంటూ లైట్ తీసుకుంటున్నారని అన్నారు. సరిగ్గా మాస్క్ లు ధరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. దీనివలన కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇదిలావుండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. అక్కడ 70మందికి కరోనా టెస్టులు చేయగా 40మందికి కరోనా వచ్చింది. అయితే వీరంతా వారం కిందట తమ గ్రామంలో జరిగిన ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు. అయితే ఇందులో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు.

దీనితో 40మందికి కరోనా వచ్చింది. మరికొందరికి టెస్టులు చేస్తున్నారు. అయితే గ్రామంలో ఇంతమందికి కరోనా రావడంతో ఆ ఊరి గ్రామస్థులు భయాందోళనలకి గురవుతున్నారు.

Next Story
Share it