Top
Batukamma

చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర.. నెలరోజులకే రూ. 50 పెరిగింది!

చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర.. నెలరోజులకే రూ. 50 పెరిగింది!
X

chicken 

Highlights

Chicken Price Hike : దేశంలోకి కరోనా ఎంటర్ అయ్యాక చికెన్ అంటేనే భయపడ్డారు జనాలు.. కరోనా ఎక్కువగా జంతువుల నుంచే వస్తుందని తెలియడంతో చికెన్ అంటేనే హడలెత్తిపోయారు.

Chicken Price Hike : దేశంలోకి కరోనా ఎంటర్ అయ్యాక చికెన్ అంటేనే భయపడ్డారు జనాలు.. కరోనా ఎక్కువగా జంతువుల నుంచే వస్తుందని తెలియడంతో చికెన్ అంటేనే హడలెత్తిపోయారు. దీనితో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి.. ఒకానొక దశలో కోళ్ళను ఉచ్చితంగా పంచిపెట్టారు కూడా..

అయితే చికెన్ తింటే కరోనా రాదని, చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు, నిపుణులు చెప్పడంతో మళ్ళీ చికెన్ కి డిమాండ్ పెరిగిపోయింది. నిన్న ఆదివారం కిలో చికెన్ ధర 260 వరకు పలికింది. నెలరోజులకి ముందు చికెన్ ధర సుమారుగా 210 వరకు పలికింది. నెలరోజుల్లోనే 50 రూపాయలు పెరగడంతో నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

చికెన్‌ తో పాటుగా గుడ్లకి, చేపలకి కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇందులో కోడిగుడ్ల విక్రయాలు బాగానే జరుగుతున్నాయి.. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 1.80 కోట్ల గుడ్ల అమ్మకాలుంటే, ఇప్పుడు రోజుకు 2 కోట్ల గుడ్లు అమ్ముతున్నారు. ప్రస్తుతం గుడ్డు ధర మార్కెట్ లో 6 రూపాయలు పలుకుతుంది.

అయితే డిమాండ్ పెరగడం, కోళ్ల దిగుమతి తగ్గుతుండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క గ్రేటర్‌ వ్యాప్తంగా లక్ష కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయని అంటున్నారు.

Next Story
Share it