Top
Batukamma

దివ్యతేజస్విని మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు!

దివ్యతేజస్విని మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు!
X

divya tejaswi 

Highlights

విజయవాడ బీటెక్ విద్యార్ధిని దివ్యతేజస్విని కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.. ప్రేమను ఒప్పుకోనందుకే నాగేంద్ర అలియాస్ స్వామి తమ కూతురు దివ్యతేజస్విని గొంతుకోశాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపించారు

విజయవాడ బీటెక్ విద్యార్ధిని దివ్యతేజస్విని కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.. ప్రేమను ఒప్పుకోనందుకే నాగేంద్ర అలియాస్ స్వామి తమ కూతురు దివ్యతేజస్విని గొంతుకోశాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపించారు. నాగేంద్ర పెయింటింగ్‌ పనిచేస్తుంటాడని, అంతేకాకుండా గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడని, అలాంటి తిరుగుబోతుకు దివ్య పేరుతో సంబంధం కలుపుతున్నారంటూ దివ్య తల్లి అవేదనని వ్యక్తం చేసింది.

అయితే విచారణలో మాత్రం నాగేంద్ర దివ్యను పెళ్లి చేసుకున్నానని వెల్లడించనట్టుగా తెలుస్తోంది. గత ఏడూ నెలలుగా తాము ప్రేమించుకున్నామని, మంగళగిరిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టుగా నిందితుడు చెప్పినట్లు సమాచారం.. అయితే పెళ్లి వ్యవహారంలో అమ్మాయి కుటుంబ సభ్యులతో గొడవ జరిగిందని, ముఖ్యంగా దివ్య తేజస్విని తండ్రి వల్లే అంతా జరిగిందని వాంగ్మూలం ఇస్తూ నాగేంద్ర స్పృహ కోల్పోయినట్లుగా సమాచారం..



క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన దివ్యతేజస్విని స్వామి ఈ రోజు (గురువారం) దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమెకి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది. దివ్యతో నాగేంద్రకు పెళ్లి జరిగిందన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆసలు ఈ విషయంలో ఎం జరిగింది అన్నదానిపైన పోలిసులు ఆరా తీస్తున్నారు.

Next Story
Share it