Top
Batukamma

కవిత రాకతో కేబినెట్‌ లో ఎవరికీ మూడింది?

కవిత రాకతో కేబినెట్‌ లో ఎవరికీ మూడింది?
X

Kcr Cabinet 

Highlights

Kavitha In Cabinet : నిజామాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ కొట్టారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పైన ఓడిపోయిన కవిత.. తిరిగి తాజాగా ఓడిన గడ్డపైనే గెలిచి సత్తా చాటింది.

Kavitha In Cabinet : నిజామాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ కొట్టారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పైన ఓడిపోయిన కవిత.. తిరిగి తాజాగా ఓడిన గడ్డపైనే గెలిచి సత్తా చాటింది. మొత్తం 823ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకొని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు. దీనితో తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టనుంది కవిత..

ఇక ఇది ఇలా ఉంటే కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కేబినెట్‌ 17 మందితో పూర్తిగా నిండిపోయింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఏర్పాటుకు పూనుకున్నారు.. ఈ క్రమంలో ఆమెను ఎలా తీసుకుంటారన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అందులో ఎవరిని తప్పించిన ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురుకోవాల్సి వస్తోంది.

ఒకవేళ మంత్రివర్గంలోకి అవకాశం లేకుంటే క్యాబినెట్ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా నడుస్తోంది. మరి దీనిపైన కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి! అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీగాల గణేష్‌ గుప్తా, షకిల్‌, జీవన్‌రెడ్డి మాత్రం కవిత ను కేబినెట్ లోకి రావడం ఖాయమే అన్నట్టుగా మాట్లాడారు. దీనిపైన పూర్తి స్పష్టత రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Next Story
Share it