Top
Batukamma

ఎమ్మెల్సీ ఎన్నిక‌లో క‌విత గ్రాండ్ విక్టరీ!

ఎమ్మెల్సీ ఎన్నిక‌లో క‌విత గ్రాండ్ విక్టరీ!
X
Highlights

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలిరౌండ్‌లోనే కవితకు భారీ ఆధిక్యం రాగా..

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలిరౌండ్‌లోనే కవితకు భారీ ఆధిక్యం రాగా.. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 738, బిజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా, 10 చెల్లని ఓట్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన ఓట్లు సాధించడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను విజేతగా ప్రకటించగా..బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మొద‌టి రౌండ్‌లో 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకి 39, కాంగ్రెస్ 22 ఓట్లు పోల‌య్యాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్‌లో 221 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 197, బీజేపీకి 17, కాంగ్రెస్‌పార్టీకి 7 ఓట్లు వ‌చ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు.

Next Story
Share it