Top
Batukamma

రెచ్చిపోయిన మావోయిస్టులు.. టీఆర్ఎస్ నేత హతం!

రెచ్చిపోయిన మావోయిస్టులు.. టీఆర్ఎస్ నేత హతం!
X

Maoists kill TRS leader

Highlights

Maoists kill TRS leader : మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు.. టీఆర్ఎస్ నేతను అంత్యంత దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా

Maoists kill TRS leader : మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు.. టీఆర్ఎస్ నేతను అంత్యంత దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండంలోని అలుబాక అనే గ్రామంలో భీమేశ్వర్‌రావు ఇంట్లోకి చొరబడ్డ మావోలు ఆయనని బయటకు తీసుకువచ్చి కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు.

అయితే ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.. మృతుడు ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతన్ని చంపిన తర్వాత ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు.



ఇక భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా మావోయిస్టుల కార్యకర్యాలపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ ఉనికిని చాటుకోవడానే భీమేశ్వర్‌రావును చంపిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Next Story
Share it