Top
Batukamma

తెలివి ఉండి మాట్లాడుతున్నావా.. తెలివి లేకా మాట్లాడుతున్నావా?

తెలివి ఉండి మాట్లాడుతున్నావా.. తెలివి లేకా మాట్లాడుతున్నావా?
X

Vijay Devarakonda 

Highlights

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓటు హక్కు పైన తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమ్మరాన్ని లేపుతున్నాయి. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునేవారికి ఓటు హక్కు ఉండకూడదు

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓటు హక్కు పైన తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమ్మరాన్ని లేపుతున్నాయి. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునేవారికి ఓటు హక్కు ఉండకూడదు అంటూ విజయ్ అన్నాడు. అంతేకాకుండా ఓటు హక్కు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రమే తెలుసునని, ధనవంతులకు అవసరం లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అయితే విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అసలు నీకు ఓటు హక్కు గురించి తెలుసా? ఓటుహక్కుకోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ( పోస్ట్ యధావిధిగా)

"అందరికీ తెలిసిన విషయాలమిద రాయాలంటే, మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుంది" అని తప్పుకుంటారు, నాకు తెలిసిన చాలామంది మేధావులైన స్నేహితులు.

"మాట్లాడాల్సిన వాళ్లు మాట్లాడకపోతే మాట్లాడకూడనివాళ్లూ, మాట్లాడ్డంరానివాళ్లని భరించాల్సివస్తుంది బాబూ" అంటే వినరేం!

చూడండి, ఇతడికి ఏం తెలుసని? పరిపాలన తెలుసా? ప్రజాస్వామ్యానికీ నియంతృత్వానికీ తేడా తెలుసా? అసలు ఓటుహక్కుకోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా? ఇతగాడు కోరిన నియంతృత్వం వుండివుంటే ఇతడు ఇలా నటుడయ్యేవాడా? ఇలా మాట్లాడే అవకాశం వుండేదా?

అసలు ఏం చూసుకుని మాట్లాడతారో అర్థంకాదు. అమాయక అభిమానుల టిక్కెట్లకి పుట్టిన వెధవలు వీళ్లు, కొంచమైనా ఎదగరా?

Siddharthi Subhas Chandrabose


Next Story
Share it