Top
Batukamma

వైఎస్సార్ బీమా స్కీం ప్రారంభించిన వైఎస్ జగన్

వైఎస్సార్ బీమా స్కీం ప్రారంభించిన వైఎస్ జగన్
X
Highlights

51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే రూ.3 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకాన్నిప్రారంబించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాంప్ కార్యాలయంలో పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తించనుంది.

51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే రూ.3 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షల పరిహారం అందిస్తారు. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల బీమా వర్తించనుంది. శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.1.50 లక్షల బీమా వర్తించనుంది.




ఈ స్కీంలో చేరే వారికి మరో వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. లబ్దిదారుల తరుపున ప్రీమియం తామే చెల్లిస్తామని ప్రరకటించింది. దీనికోసం 510 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.

Next Story
Share it