Top
Batukamma

ఏపీల ఏం సక్కదనం లేదు.. నిర్లక్ష్యంతోని ప్రాణాలు తీస్తున్నరు..!

ఏపీల ఏం సక్కదనం లేదు.. నిర్లక్ష్యంతోని ప్రాణాలు తీస్తున్నరు..!
X
Highlights

కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కారు చాలా పర్ ఫెక్ట్ గా పనిచేస్తోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం...

కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కారు చాలా పర్ ఫెక్ట్ గా పనిచేస్తోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నూరుపాళ్లు బెటర్ అని అంతా పొగిడేస్తున్నారు.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో జగన్ సర్కారు చాలా అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. టెస్టుల విషయంలో తెలంగాణ కంటే చాలా బెటర్ పొజిషన్ లో ఏపీ ఉందని లెక్కలు చెబుతున్నాయి. ట్రీట్మెంట్ కూడా అద్భుతం అంటూ ఏపీ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

కానీ.. ఆంధ్రప్రదేశ్ లోనూ పరిస్థితి అంత బాగా ఏం లేదని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. తెలంగాణకు ఏ మాత్రం తీసిపోని విధంగానే నిర్లక్ష్యం కొనసాగుతోందనే విమర్శలే కాదు.. వాస్తవాలు బయటకొస్తున్నాయి.

ఎన్టీవీ న్యూస్ ఛానల్ రిపోర్ట్ మధుసూదన్ రెడ్డి కరోనాతో చనిపోయారు. ఆయన హాస్పిటల్ లో ఉండగా ఓ ఆడియో తన మిత్రులకు పంపించారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

[gallery size="full" ids="114"]

తనకు శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పినా డాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆయన ఆడియోలో చెప్పారు. స్కానింగ్ చేయాలని కోరినా వినిపించుకోలేదన్నారు. ఈ విషయాన్ని ఎలాగైన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తన ప్రాణాలు కాపాడాలని ఆడియోలో కోరారు మధుసూదన్ రెడ్డి. ఆయన రిలీజ్ చేసిన ఆడియోలో కూడా ఆయాసపడుతూనే మాట్లాడారు.

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. ఓ జర్నలిస్టుగా ఉండి.. అధికారులతో పరిచయాలు ఉన్న వ్యక్తినే ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Next Story
Share it