Top
Batukamma

కరోనాతో మరో టెన్షన్.. ఆ 9 గంటలే కీలకం..!

కరోనాతో మరో టెన్షన్.. ఆ 9 గంటలే కీలకం..!
X
Highlights

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనా వైరస్.. డిసెంబర్ లో చైనాలో పుట్టి.. ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేసింది. పూర్తిగా జనజీవనాన్ని స్తంభింపజేసింది. కోట్లాది మందిని హాస్పిటల్ పాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఇప్పటికీ ఈ మహమ్మారి ముప్ప తొలగిపోలేదు.

విపరీతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. వైరస్ జీవిత కాలం ఎంత..? ఏ ఉపరితలంపై ఎంత సేపు ఉంటుంది..? ఎలాంటి వారికి సోకుతోంది..? రీ ఇన్ఫెక్షన్ నిజమేనా..? ఇలాంటి చాలా అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి

ఇటీవల దీనిపై పరిశోధనలు జరిపిన జపాన్ శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయం చెప్పారు. కరోనా వైరస్.. మానవ శరీరంపై 9 గంటల పాటు ఉంటుందని తేల్చారు. అంటే.. ఒకసారి మన చర్మంపై పడితే అది 9 గంటల పాటు అలాగే జీవించి ఉంటుంది. ఈ గ్యాప్ లో మనం ఎవరితోనైనా కాంటాక్ట్ అయితే అది వారికి కూడా సోకుతుంది.


ఇప్పుడు ఈ రిజల్ట్ తో శాస్త్రవేత్తల్లో ఆందోళన మొదలైంది. వైరస్ మన చర్మంపై పడినా.. మనం వైరస్ క్యారియర్ లు గా మారే ప్రమాదం ఉందన్న మాట. 9 గంటల పాటు మనం వైరస్ కు క్యారియర్ గా పనిచేస్తాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు

కరోనాతో చనిపోయిన వారి డెడ్ బాడీల నుంచి శాంపిల్ తీసుకుని పరీక్ష చేశారు. పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ చర్మంపై 9 గంటల పాటు.. ఉంటే మామూలు ఫ్లూ కలిగించే వైరస్ కేవలం 1.8 గంటల పాటు మాత్రమే ఉంటోందని వెల్లడైంది.

అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన మార్గదర్శకాలు తప్పక పాటించాలంటున్నారు శాస్త్రవేత్తలు. తరుచుగా చేతులు కడుగుకోవడం ద్వారా చర్మంపై ఉన్న వైరస్ ను చంపేయవచ్చంటున్నారు. శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నా వైరస్ చనిపోతుందని చెప్పింది.


దీనికోసం ఇథనాల్ తో ఓ ప్రయోగం కూడా చేశారు. వైరస్ ఉన్న చర్మంపై ఇథనాల్ పూసిన తర్వాత.. కేవలం 15 సెకన్లలో వైరస్ చనిపోయింది. దీంతో ప్రతీ ఒక్కరు శుభ్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు.

Next Story
Share it