Top
Batukamma

Daily Horoscope: 22-11-2020 (ఆదివారం) నేటి పంచాంగం, రాశిఫలాలు

Daily Horoscope: 22-11-2020 (ఆదివారం) నేటి  పంచాంగం, రాశిఫలాలు
X
Highlights

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వస్తులాభాలు. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

22-11-2020 ఆదివారం నేటి పంచాంగం:

ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శార్వరి నామ సంవత్సరం'దక్షిణాయణం శరత్ ఋతువు

కార్తీక మాసం శుక్ల పక్షం'తిధి:అష్టమి రా2.02 తదుపరి నవమి

నక్షత్రం:ధనిష్ఠ మ3.13 తదుపరి శతభిషం'యోగం:ధృవం ఉ10.39 తదుపరి వ్యాఘాతం,కరణం:భద్ర/విష్ఠి మ1.52 తదుపరి బవ రా2.02 ఆ తదుపరి బాలువ,వర్జ్యం: రా10.46 - 12.27

దుర్ముహూర్తం :మ3.50 - 4.35,అమృతకాలం:లేదు

రాహుకాలం: సా4.30 - 6.00,యమగండం/కేతుకాలం:మ12.00 -1.30,సూర్యరాశి:వృశ్చికం ||చంద్రరాశి:కుంభం,

సూర్యోదయం:6.12,సూర్యాస్తమయం:5.20,సర్వే జనాః సుఖినో భవంతు,శుభమస్తు


నేటి రాశిఫలాలు :

మేషం:

వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృషభం:

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా చికాకులు.

మిథునం:

పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం:

పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

సింహం:

ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. ధనవ్యయం. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు.

కన్య:

ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. భూలాభాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి.

తుల:

పరిస్థితులు అనుకూలించవు. మిత్రులతో వైరం. దూరప్రయాణాలు. కొన్ని పనులలో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం:

కొత్త వ్యక్తుల పరిచయం. బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ఇంటాబయటా అనుకూలస్థితి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

ధనుస్సు:

వ్యవహారాలలో విజయం. భూలాభాలు కలుగుతాయి. మీ ఖ్యాతి పెరుగుతుంంది. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మకరం:

వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో హఠాత్తుగా మార్పులు.

కుంభం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వస్తులాభాలు. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం:

ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

Next Story
Share it