Top
Batukamma

ఈ రాశి వారికి శుభవార్తలు, వాహనయోగం, కొత్త పరిచయాలు..

ఈ రాశి వారికి  శుభవార్తలు, వాహనయోగం, కొత్త పరిచయాలు..
X
Highlights

శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం హేమంత ఋతువు,మార్గశిర మాసం బహుళ పక్షం,తిధి:దశమి రా8.19 తదుపరి ఏకాదశి,నక్షత్రం:స్వాతి మ1.24 తదుపరి విశాఖ,యోగం

08-01-2021 శుక్రవారం నేటి పంచాంగం :

ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం హేమంత ఋతువు,మార్గశిర మాసం బహుళ పక్షం,తిధి:దశమి రా8.19 తదుపరి ఏకాదశి,నక్షత్రం:స్వాతి మ1.24 తదుపరి విశాఖ,యోగం:ధృతి సా5.49 తదుపరి శూలం,కరణం:వణిజ ఉ9.30 తదుపరి భద్ర/విష్ఠి రా8.19 ఆ తదుపరి బవ,వర్జ్యం : సా6.36 - 8.05,దుర్ముహూర్తం: ఉ8.48 - 9.32 & మ12.28 - 1.12,అమృతకాలం:ఉ6 41వరకు & తె3.22 - 5.01

రాహుకాలం:ఉ10.30 - 12.00,యమగండం/కేతుకాలం:మ3.00 -4.30

సూర్యరాశి:ధనుస్సు || చంద్రరాశి:తుల,సూర్యోదయం:6.36 ||సూర్యాస్తమయం:5.35

08-1-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు :

మేషం:పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

వృషభం: పరిస్థితులు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ధనలాభాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

కర్కాటకం: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వస్తులాభాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అభివృద్ధి ఉంటుంది.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొత్త కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

తుల: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. నూతన పరిచయాలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

మకరం:యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుంభం:కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Next Story
Share it