Top
Batukamma

Oxford Vaccine In India : ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ కు వచ్చేసింది

Oxford Vaccine In India : ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ కు వచ్చేసింది
X
Highlights

Oxford Vaccine In India For Clinical Trials :కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. భారతీయులకు...

Oxford Vaccine In India For Clinical Trials :

కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. భారతీయులకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. అతికొద్ది రోజుల్లోనే మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ఇప్పుడు భారత్ కు వచ్చింది. భారత్ లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. లండన్ లో ఈ వ్యాక్సిన్ పై ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి.

ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా సంస్థ కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుమతి పొందింది. చాలా సంప్రదింపుల తర్వాత dcgi అనుమతులు ఇచ్చింది.

oxford vaccine in india for clinical trials

ఈ వ్యాక్సిన్ ను కొవిడ్ షీల్డ్ గా పిలుస్తున్నారు. ముంబై, పుణెతో పాటు.. దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ట్రయల్స్ సక్సెస్ అయితే.. వ్యాక్సిన్ ప్రొడక్షన్ మొదలవుతుంది.

సిరం ఇనిస్టిట్యూట్ కు భారీగా వ్యాక్సిన్ తయారు చేసే కెపాసిటీ ఉంది. 20 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ తయారుచేసే సామర్థ్యంతో ల్యాబులున్నాయని అధికారులు చెబుతున్నారు.

oxford vaccine in india for clinical trials oxford vaccine in india for clinical trials

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా కలిసి తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ఇటీవలే కోతులపై ప్రయోగించ చూశారు. కోతులపై ప్రయోగంలో మంచి ఫలితాలు వచ్చాయని సైంటిస్ట్ లు చెప్పారు.

వైరస్ ప్రభావానికి గురైన కోతులకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చాలా ఎక్కువగా యాంటీబాడీలు తయారయ్యాయన్నారు. మనుషుల్లో కంటే కూడా కోతుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు తయారైనట్టు తెలుస్తోంది.

oxford vaccine in india for clinical trials oxford vaccine in india for clinical trials

థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తైతే.. దేశంలో మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. సిరం ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఎక్కువే ఉంది. కాబట్టి.. ఎక్కువగా వైరస్ కు ఎఫెక్ట్ అయిన ప్రాంతాలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందే అవకాశం ఉంది.

Next Story
Share it