Top
Batukamma

paranna jeevi movie first look : అమ్మతోడు.. పవన్ ఫ్యాన్ గా మారిన కత్తి మహేష్!

paranna jeevi movie first look : అమ్మతోడు.. పవన్ ఫ్యాన్ గా మారిన కత్తి మహేష్!
X
Highlights

Paranna jeevi movie first look : ఇప్పటివరకు అందరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి వేలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ చాలా...

Paranna jeevi movie first look : ఇప్పటివరకు అందరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి వేలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ చాలా రచ్చరచ్చ చేశాడు. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు అన్నట్టుగా ఇప్పుడు వర్మ పైన ఓ సినిమా తెరకెక్కుతుంది. అటు వర్మ పవన్ పైన పవర్ స్టార్ సినిమా చేస్తే ఇటు పవన్ ఫ్యాన్స్ వర్మ పైన సెటైరికల్‌గా ఓ సినిమా చేస్తున్నారు.

సినిమా టైటిల్ పరాన్నజీవి అని పెట్టారు. దీనికి ‘రెక్‌లెస్‌ జెనెటిక్‌ వైరస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌.. ఈ సినిమాకి బిగ్ బాస్ 2 ఫేం డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అర్జీవీగా షకలక శంకర్ నటిస్తున్నాడు. ర్జీవీ పాత్ర ఓ నటిని‌ డైరెక్ట్‌ చేస్తున్న స్టిల్‌ రిలీజ్ చేశారు.

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బద్ధ శత్రువు అయిన కత్తి మహేష్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు. కత్తి పాత్రను రివీల్ చేస్తూ ‘పరాన్నజీవి’ చిత్ర రచయిత విజయ నాగేశ్ ట్వీట్ చేశారు. " క‌త్తిలాంటోడు .. ఖ‌త‌ర్నాక్ వీడు.. మాట మ‌హా స్పీడు.. రాతల్లో వీడ్ని మించినోడు లేడు.. కాంట్రవ‌ర్సీల అమ్మా మొగుడు.. అమ్మ తోడు.. ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్ అయ్యాడు చూడు! అదెలాగంటే వెయిట్ అండ్ సీ ఫ‌ర్ పరాన్నజీవి " అంటూ అయన ట్వీట్ చేశారు.

https://twitter.com/SriVijayaNagesh/status/1285876921272643584?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1285876921272643584|twgr^&ref_url=https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-kathi-turns-pawan-kalyan-fan-for-parannageevi-movie/articleshow/77110302.cms

పవన్ కళ్యాణ్ అన్న, అయన ఫ్యాన్ అన్న ఒంటికాలు మీద లేచే కత్తి మహేష్ ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటించడం పట్ల అభిమానుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కత్తి మహేష్‌ను తీసుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సినిమా తీసేది పవన్ అభిమానులేనా అని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story
Share it