Subscribe

Andhrapradesh, News

నాగబాబు ట్వీట్స్ పై పవన్ రియాక్షన్!

Pawan Kalyan, Nagababu

Pawan Kalyan, Nagababu

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే..  ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నాగబాబు పై చాలామంది సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫుల్లుగా దుమ్ముదులిపారు. అయితే ఇది నాగబాబు అభిప్రాయమే లేకా జనసేన అభిప్రాయమా..? అంటూ సోషల్ మీడియాలో చాలామంది సీరియస్ అయ్యారు. జాతిపితను హాతమార్చిన వాడిని జనసేన పొగుడుతోందా..? అని ఫుల్లుగా వేసుకున్నారు.

అయితే దీనిపైన అప్పుడే నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అదిపూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని.. జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ట్విట్ చేశారు. తాజాగా ఇదే  విషయాన్ని నాగబాబు తమ్ముడు , జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు.

జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజీక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలేగానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం
చేస్తున్నాను. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్దులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు సోషల్‌ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి
ఎటువంటి సంబంధమూ లేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నాము. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒక మాట చెబుతున్నా…

ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లవద్దని కోరుతున్నాను. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను “అని పవన్ కళ్యాణ్ పెర్కోన్నారు.

Also Read: ప్రధాని అంటే పట్టింపే లేదా..? వాటీజ్ దిస్ దీదీ..?

Image

(Visited 5 times, 1 visits today)