Happy Vijayadashami

ఈ దసరా పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు, ఆనందాలు తీసుకురావాలని ఆశీస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

దసరా అంటే ఏమిటి?

దశ(పది), హరా(ఓటమి) అనే సంస్కృత పదాల నుంచి దసరా అనేది పుట్టింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

పంటల పండుగ

తమిళనాడులోనూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో జరిగే దసరా ఉత్సవాలను గోలు అని పిలుస్తారు.

హిందువుల్లోని కొన్ని ఉపకులాల్లో దసరాను విజయదశమి అని కూడా పిలుస్తారు. పదవ రోజు విజయానికి ప్రతీకగా విజయదశమి అనే పేరు వచ్చింది.

మన దేశంలో అత్యంత ఘనంగా ఉత్సవాలను మైసూరు(కర్ణాటక)లో నిర్వహిస్తారు.

మైసూర్‌లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం 1 7వ శతాబ్దంలో ప్రారంభమైంది. అప్పటి మైసూర్‌ మహారాజు వడియార్‌ ఆదేశాలతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మొదలైంది.

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. మట్ట కుండల్లో బార్లీ గింజలను నవరాత్రుల్లోని తొలిరోజున నాటుతారు. దసరా రోజు నాటికి ఆ విత్తనాలకు మొలకలు వస్తే.. చాలా అదృష్టంగా భావిస్తారు.

బౌద్దులకు కూడా దసరా చాలా ముఖ్యమైన పండుగ. మౌర్య వంశానికి చెందిన మహారాజు అశోకుడు అదేరోజున బుద్దిజంలోకి మారినట్లు చరిత్ర చెబుతోంది.